హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ ఇప్పుడు యురోపియన్ ఛాంపియన్‌షిప్‌గా మారింది. టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్స్‌లో బ్రెజిల్, ఉరుగ్వే జట్లు ఓటమి పాలవ్వడంతో ప్రస్తుతం టోర్నీలో మిగిలిన ఆరు జట్లు యురోపియన్ జట్లే కావడం విశేషం.
వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
కాగా, శనివారం జరిగే క్వార్టర్స్‌లో స్వీడన్-ఇంగ్లాండ్, క్రొయేషియా-రష్యా జట్లు తలపడనున్నాయి. దీంతో ఇకపై ఫిఫా సమరం కాస్తా యురోపియన్ పోరుగా మారనుంది. టోర్నీలో భాగంగా ఇప్పటికే ఫ్రాన్స్, బెల్జియం జట్లు సెమీస్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్యాలో జరుగుతున్న వరల్డ్ కప్ 21వది.
దీంతో సెమీస్‌లో మొత్తం యురోపియన్ జట్లే పాల్గొనడం ఇది ఐదోసారి అవుతుంది. 2006 తర్వాత ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. 2006లో ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు సెమీస్‌కు వెళ్లాయి. కానీ, ప్రస్తుతం వరల్డ్ కప్‌లో టైటిల్ ఫేవరేట్లుగా బరిలోకి దిగిన బ్రెజిల్, జర్మనీ, ఇటలీ, అర్జెంటీనా, ఉరుగ్వేలు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం సెయింట్ పీటర్స్ బర్గ్ వేదికగా మంగళవారం తొలి సెమీస్ జరగనుండుగా, రెండవ సెమీస్ బుధవారం మాస్కో వేదికగా జరగనుంది. వరుసగా వరల్డ్‌కప్‌ను ఓ యూరోపియన్ జట్టు గెలవడం ఇది నాలుగవసారి అవుతుంది. 2006లో ఇటలీ, 2010లో స్పెయిన్, 2014లో జర్మనీ ఫిఫా కప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి