Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Euro 2024: స్టన్నింగ్.. చరిత్రలో నిలిచే గోల్ సేవ్ (Video)

యూరో కప్ ఫుట్‌బాల్‌లో టర్కీ క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఆస్ట్రియాతో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో 2-1తో ఘన విజయం సాధించింది. ఆఖర్లో అద్భుతమైన సేవ్‌తో టర్కీ ఊపిరిపీల్చుకుంది. చివరి సెకన్లతో ఆస్ట్రియా దాదాపు గోల్ కొట్టే అంత పనిచేసింది. కానీ గోల్‌కీపర్ గునాక్ సూపర్బ్ సేవతో జట్టును గెలిపించాడు. మెరిహ్ డెమిరల్ కూడా విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండు గోల్స్‌తో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు.

ఆరంభంలోనే పోరు ఆసక్తికరంగా మారింది. తొలి నిమిషంలోనే ఇరు జట్లకు గోల్ చేసే అవకాశాలు దక్కాయి. ఆస్ట్రియా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరోవైపు టర్కీ మొదటి నిమిషంలో స్కోరు ఖాతా తెరిచింది. ఈ క్రమంలో యూరో ఫుట్‌బాల్‌లో అత్యంత వేగంగా నమోదైన రెండో గోల్‌‌గా ఇది రికార్డులకెక్కింది. ఆ తర్వాత కూడా ఆస్ట్రియాకు అవకాశాలు వచ్చాయి. కానీ తృటిలో గోల్స్ చేజారాయి.

Euro 2024 Turkey Defeats Austria and Secures Spot in Quarter-Finals

ప్రారంభంలో గోల్ కొట్టిన డెమిరల్ 59వ నిమిషంలో మరో గోల్ సాధించాడు. గులెర్ నుంచి దక్కిన సాయాన్ని గోల్‌గా మలిచాడు. దీంతో టర్కీ 2-0తో మరింత ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఆరు నిమిషాల వ్యవధిలోనే గ్రోగోరిటిష్ గోల్ సాధించి ఆస్ట్రియాను 1-2తో పోటీలోకి తెచ్చాడు. ఆఖరి సెకన్లలో ఆస్ట్రియా ఆటగాడు బౌమ్‌గార్ట్‌నర్‌ హెడర్‌తో స్కోరు సమం చేయడానికి ప్రయత్నించాడు. కానీ గోల్‌కీపర్‌ గునాక్‌ గాల్లో కుడివైపుకు డైవ్‌ చేస్తూ అద్భుతంగా బాల్‌ను అడ్డుకున్నాడు. కాగా, ఇది చరిత్రలో నిలిచిపోయే గోల్‌సేవ్‌గా మారుతుందని నెటిజన్లు కొనియాడుతున్నారు.

క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్
స్పెయిన్‌ x జర్మనీ (శుక్రవారం రాత్రి 9.30)
పోర్చుగల్‌ x ఫ్రాన్స్‌ (శుక్రవారం రాత్రి 12.30)
ఇంగ్లండ్‌ x స్విట్జర్లాండ్‌ (శనివారం రాత్రి 9.30)
నెదర్లాండ్స్‌ x టర్కీ (శనివారం రాత్రి 12.30)

Story first published: Thursday, July 4, 2024, 12:49 [IST]
Other articles published on Jul 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+