Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

EURO 2024: ఎంబాపే ముక్కు పగిలింది (Video)

యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో మాజీ ఛాంపియన్ ఫ్రాన్స్ ఘనంగా బోణీ కొట్టింది. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో విజయం సాధించింది. అయితే ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో ఆస్ట్రియా ప్లేయర్ మాక్సీమిలన్ నోబర్ చేసిన పొరపాటు ఫ్రాన్స్‌‌కు వరంగా, ఆస్ట్రియాకు శాపంగా మారింది. అసలేం జరిగిందంటే..

హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్‌లో 38వ నిమిషంలో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపే గోల్‌‌కు గురిపెట్టాడు. ఈ సమయంలో మాక్సీమిలన్ దాన్ని హెడర్‌తో ప్రతిఘటించాలనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అది సెల్ఫ్ గోల్‌గా మారింది. దీంతో ఫ్రాన్స్‌ 1-0తో ఖాతా తెరిచింది. అనంతరం ఆస్ట్రియా స్కోరును సమయం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించినా నిరాశే మిగిలింది. మ్యాచ్ పూర్తయ్యే సమయానికి గోల్ చేయలేకపోయింది.

EURO 2024 France Captain Kylian Mbappe Sustains Broken Nose in Win Over Austria

అయితే ఈ పోరులో ఎంబాపే‌ తీవ్రంగా గాయపడ్డాడు. ముక్కు పగిలి రక్తస్రావం అయ్యింది. బంతిని అందుకోవడానికి గాల్లోకి ఎగిరి ఎంబాపే దెబ్బ తగిలించుకున్నాడు. ఆస్ట్రియా ప్లేయర్ డాన్సో భుజానికి బలంగా తాకడంతో ముక్కు ఎముక చిట్లింది. దీంతో ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం అతడు ఆసుపత్రికి వెళ్లాడు. ఈ గాయం మానడానికి సాధారణంగా నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుంది. దీంతో ఎంబాపే కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.

యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో టర్కీ విజయం సాధించి బోణీ కొట్టింది. జార్జియాను 3-1తో చిత్తుగా ఓడించింది. 25వ నిమిషంలో ములర్ట్, 65వ నిమిషంలో అర్డా గులెర్, ఆట కొనసాగింపులో కరీమ్ టర్కీ తరఫున గోల్స్ చేశారు. 32వ నిమిషంలో మికాడాడ్జె గోల్ చేయడంతో జార్జియా స్కోరుబోర్డు ఖాతా తెరిచింది.

Story first published: Wednesday, June 19, 2024, 12:23 [IST]
Other articles published on Jun 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+