Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Premier League: మాంచెస్టర్ సిటీ ఘన విజయం!

ఇంగ్లండ్ ప్రీమియర్ ఫుట్‌బాల్ లీగ్‌లో మాంచేస్టర్ యునైటెడ్ సిటీ మరో విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ సిటీ 1-0తో బ్రెంట్‌ఫోర్డ్‌‌ ఫుట్‌బాల్ క్లబ్‌ను ఓడించింది. మాంచేస్టర్ సిటీ తరఫున ఎర్లింగ్ హాలాండ్(71వ నిమిషం) ఏకైక గోల్ నమోదు చేయగా.. గోల్ కీపర్ ఎడర్సన్ అసాధారణ కీపింగ్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు.

చెల్సీతో గత మ్యాచ్‌ను డ్రా చేసుకున్న మాంచెస్టర్ సిటీ.. మళ్లీ విజయాల బాట పట్టింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో దూసుకెళ్లింది. హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఆటగాళ్లు గోల్స్ కోసం నువ్వా నేనా అన్నట్లు తడబడ్డారు. ఫస్టాఫ్‌లో బ్రెంట్‌ఫోర్డ్ ఆటగాళ్లే బంతిపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు.

Erling Haaland fires home Manchester Citys winner

బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్న బ్రెంట్ ఫోర్డ్ ఆటగాళ్లు.. మాంచెస్టర్ యునైటెడ్ డిఫెన్స్‌ను చేధిస్తూ.. పదే పదే వారి గోల్‌ పోస్ట్‌పై దాడి చేశారు. బ్రెంట్ ఫోర్డ్ గోల్ ప్రయత్నాలను మాంచెస్టర్ కీపర్ ఎడర్సన్ సమర్ధవంతంగా అడ్డుకున్నాడు. 16వ నిమిషంలో బ్రెంట్ ఫోర్డ్ ప్లేయర్ చేసిన ప్రయత్నాన్ని ఎడర్సన్ తిప్పికొట్టాడు. ఆ వెంటనే ఆ జట్టుకు పెనాల్టీ కార్నర్ లభించగా.. సద్వినియోగం చేసుకోలేకపోయింది.

గోల్ కోసం మాంచెస్టర్ ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించ లేదు. 37వ నిమిషంలో గోల్ కీపర్‌ను చేధిస్తూ.. మాంచెస్ట్ ప్లేయర్ బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించగా.. బ్రెంట్ ఫోర్డ్ ప్లేయర్ ఛాకచక్యంగా అడ్డుకున్నాడు. దాంతో ఫస్ట్‌ఫ్ 0-0తో ముగిసింది.

సెకండాఫ్‌‌లో జూలు విధిల్చిన మాంచెస్టర్ ఆటగాళ్లు బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ప్రత్యర్థి డిఫెన్స్‌ను చేధిస్తూ పదే పదే గోల్ పోస్ట్‌పైకి దాడి చేసి ఒత్తిడిని పెంచారు. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకున్న ఎర్లింగ్ హాలాండ్.. ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు గోల్ కీపర్ చేధిస్తూ బంతిని అద్భుతంగా గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దాంతో మాంచెస్టర్ 1-0తో ఖాతా తెరిచింది.

ఆ తర్వాత ఇరు జట్లు గోల్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న మాంచెస్టర్ యునైటెడ్ అద్భుత విజయాన్ని అందుకుంది.

Story first published: Wednesday, February 21, 2024, 22:26 [IST]
Other articles published on Feb 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+