Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ విషయం నాకు తెలియదు: మాంచెస్టర్ యునైటెడ్ మేనేజర్

మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ కొత్త డైరెక్టర్ నియామకం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని ఆ జట్టు మేనేజర్ ఎరిక్ టెన్ హగ్ తెలిపారు. ఎవరూ వచ్చినా.. ఇద్దరం కలిసే జట్టు కోసం పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. న్యూకాజెల్ క్లబ్ మేనేజర్ డాన్ అష్వర్త్‌ను తమ డైరెక్టర్‌గా నియమించుకోవాలని మాంచెస్టర్ యునైటెడ్ భావిస్తుందని ఓ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

మాంచెస్టర్ యూనైటెడ్ జట్టులోని 25 శాతం వాటను తీసుకున్న సర్ జిమ్ రాట్‌క్లిప్.. వచ్చే వారంలోపు ఫుట్‌బాల్ ఆపరేషన్స్ బాధ్యతలను తీసుకోనున్నాడు. అతను బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమ్ కొత్త డైరెక్టర్ నియామక ప్రక్రియ మరింత వేగం కానుంది. ప్లేయర్ ట్రేడింగ్ విషయంలో మరింత ఫోకస్‌గా ఉండేందుకే మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ కొత్త డైరెక్టర్ నియమకం చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Erik ten Hag wants

'ఫుట్‌బాల్ డైరెక్టర్ నియామకం చాలా ముఖ్యం. ఫుట్‌బాల్ ఫిలాసఫీ, ఫుట్‌బాల్ వ్యూహాలు, జట్టులో మీకు అవసరమైన ఆటగాళ్ల ప్రొఫైల్స్‌కు సంబంధించిన విషయాలు చూసుకునే విషయంలో డైరెక్టర్ పాత్ర కీలకం అవుతోంది. సరైన ఆటగాళ్లను పొందేందుకు చాలా మంచి కమ్యూనికేషన్ కలిగి ఉండాలి. జట్టును డెవలప్ చేయడానికి, సరైన ఆటగాళ్లను తీసుకోవడానికి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం.

ఇన్నాళ్లు నేను ఒక్కడినే ఈ పనులన్నీ చేశాను. కొన్నిసార్లు ఇతరుల సహాయం తీసుకున్నాను. మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతున్నప్పుడు.. జట్టు లక్ష్యాలు మారుతున్నప్పుడు.. ఒకే లక్యంతో పని చేసే వ్యక్తుల అవసరం ఉంటుంది. ఈ విషయంలో కొత్తగా వచ్చే డైరెక్టర్‌ నాకు సాయంగా ఉంటాడు.'అని ఎరిక్ టెన్ హగ్ చెప్పుకొచ్చారు.

Story first published: Thursday, February 15, 2024, 22:08 [IST]
Other articles published on Feb 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+