Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఏమో నాకేం తెలుసు. నేనేమైనా డాక్టర్‌నా' ఎరిక్ బెల్లీకి సర్జరీపై కోచ్

Eric Bailly may require surgery on 'serious' ankle injury

హైదరాబాద్: మాంచెస్టర్ యునైటెడ్ జట్టుకు కీలక ఆటగాడు ఎరిక్ బెల్లీ. ఇతను ప్రస్తుతం కాలి చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. కొన్ని రోజులుగా మ్యాచ్‌కు దూరమవుతానేమోనని బాధపడుతున్నాడు. దానికి స్పందించాల్సిన జట్టు మేనేజర్ అతనికి సాయపడకపోగా వ్యంగ్యంగా బదులిస్తున్నాడు.

బుధవారం జరిగిన మ్యాచ్‌లో భాగంగా మాంచెస్టర్ యునైటెడ్ చిల్సీ క్లబ్ హోరాహోరీగా తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచిన మాంచెస్టర్ యునైటెడ్ జట్టు మేనేజర్ జోస్ మొరిన్హో మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. "ఔను. గాయపడ్డ మాట వాస్తవమే మేం దానికి ట్రీటెమెంట్ చేయిస్తున్నాం. తగ్గుతుందని ఆశపడుతున్నాం." అని అన్నాడు. అదే సంభాషణ కొనసాగిస్తూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు "ఏమో నాకేం తెలుసు. నేనేమైనా డాక్టర్‌నా సర్జరీ చేయాలా అని అడిగితే నేనేం చెప్పగలను." అని ముగించాడు.

ఎరిక్ బెల్లీ మాంచెస్టర్ యునైటెడ్ జట్టులో జూన్ 2016లో జాయిన్ అయ్యాడు. ఇతను జట్టుకు సంబంధించిన క్లబ్ తో 30 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత సంవత్సరం అక్టోబరు నుంచి ఈ గాయంతో బాధపడుతున్నా అలానే కొనసాగించడం విశేషం.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 14, 2017, 12:24 [IST]
Other articles published on Dec 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+