Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

27వ వారానికి ఇపీఎల్: హైలెట్ మ్యాచ్‌లివే

హైదరాబాద్: ఇంగ్లీషు ప్రీమియర్ లీగ్ (ఇపీఎల్) 27వ వారానికి చేరుకుంది. ఈ వారంలో మాంచెస్టర్ యునైటెడ్, ఎఎఫ్‌సి బౌర్నీమౌత్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ హైలెట్‌గా నిలవనుంది. ఇపీఎల్ కప్ ఛాంపియన్స్‌గా అవతరించిన మాంచెస్టర్ యునైటెడ్ జట్టు ఎలాగైనా సరే ఈ గేమ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.

ఈ గేమ్‌లో మాంచెస్టర్ విజయం సాధిస్తే లివర్ పూల్‌ను దాటి పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరుతుంది. మరో గేమ్‌లో లివర్ పూల్ జట్టు ఆర్సెనల్‌తో తలపడుతుంది. ఈ ఏడాది లివర్‌పుల్ జట్టు అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతోంది. ఇటీవలే లీసెస్టర్ సిటీతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో నిలిచింది.

మరోవైపు ఆర్సెనల్ జట్టు వరుస విజయాలతో టైటిల్ బరిలో నిలిచింది. రెడ్స్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే టైటిల్ ఆశలు సజీవంగా ఉంచుకుంటుంది. ఈ వారంలో వీటితో పాటు పాయింట్ల పట్టికలో మొదటి స్ధానంలో ఉన్న చెల్సియా వెస్ట్ హామ్ యునైటెడ్ జట్టుతో తలపడనుంది. ఇక మాంచెస్టర్ సిటీ జట్టు సండర్లాండ్ జట్టును ఢీ కొట్టనుంది.

EPL 2016/17: Schedule for game week 27

ఇపీఎల్ 27వ వారంలో జరిగే అన్ని మ్యాచ్‌లు:

శనివారం, మార్చి 4
మాంచెస్టర్ యునైటెడ్ Vs ఎఎఫ్‌సి బౌర్నీమౌత్ - 6:00 PM (IST)
వెస్ట్ బ్రౌమిచ్ అల్బియాన్ Vs క్రిస్టల్ ప్యాలెస్ - 8:30 PM (IST)
స్వాన్ సీ సిటీ Vs బర్నేలే ఎఫ్‌సి - 8:30 PM (IST)
వాట్ ఫోర్డ్ Vs సౌతాంప్టన్ - 8:30 PM (IST)
లీసెస్టర్ సిటీ Vs హల్ సిటీ - 8:30 PM (IST)
స్టోక్ సిటీ Vs మిడిల్స్ బ్రో - 8:30 PM (IST)
లివర్ పూల్ Vs ఆర్సెనల్ - 11:00 PM (IST)

ఆదివారం, మార్చి 5
టోటెన్హామ్ హాట్స్పుర్ Vs ఎవర్టెన్ - 7:00 PM (IST)
సండర్లాండ్ Vs మాంచెస్టర్ సిటీ - 9:30 PM (IST)

మంగళవారం, మార్చి 7
వెస్ట్ హామ్ యునైటెడ్ Vs చెల్సియా - 1:30 AM (IST)

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+