హైదరాబాద్: ఇంగ్లీషు ప్రీమియర్ లీగ్ (ఇపీఎల్) 13వ వారం ముగిసింది. పాయింట్ల పట్టికలో చెల్సియా ఎఫ్‌సి తిరిగి తన నెంబర్ వన్ స్ధానాన్ని కైవసం చేసుకుంది. టోర్నీలో భాగంగా 13వ వీక్‌లో తొలి గేమ్ మాంచెస్టర్ సిటీ, బర్న్లేల మధ్య జరిగింది. ఈ గేమ్‌లో రెండు గోల్స్ చేసిన మాంచెస్టర్ విజయం సాధించింది.
ఆ తర్వాత జరిగిన సండర్లాండ్‌పై జరిగిన గేమ్‌లో లివర్‌పూల్ విజయం సాధించింది. ఈ గేమ్ ఇరుజట్ల మధ్య పోటా పోటీగా సాగింది. ఈ గేమ్‌లో స్టార్ మిడిల్ ఫీల్డర్ ఫిలిప్పీ కోర్టిహోకు తీవ్ర గాయం పాలయ్యాడు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చివరకు లివర్ పూల్ 2-0తో సండర్లాండ్‌పై నెగ్గింది.
ఇక చెల్సియా ఎఫ్‌సి, తోతహమ్ హట్సుపుర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నిజంగా అధ్భుతం. చెల్సియా జట్టు ఆటగాళ్లు పీడ్రో, విక్టర్ మోసస్ గోల్స్‌తో తోతహమ్ హట్సుపుర్‌పై 2-1తో విజయం సాధించింది. ఈ విజయంతో చెల్సియా ఎఫ్‌సి తిరిగి నెంబర్ వన్ స్ధానాన్ని కైవసం చేసుకుంది.
ఇక అదివారం జరిగిన ఆర్సెనల్, ఎఎఫ్‌సి బోర్నీమోత్ జట్ల మధ్య జరిగిన గేమ్‌లో ఆర్సెనల్ జట్టు ఆటగాళ్లు ఎడ్డీ హోయి అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో 3-1తో ఎఎఫ్‌సి బోర్నీమోత్‌పై ఆర్సెనల్ విజయం సాధించింది. మాంచెస్టర్ యునైటెడ్, వెస్ట్ హామ్ యునైటెడ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఇపిఎల్‌లో 13వ వారం ఫలితాలు:
శనివారం, నవంబర్ 26
బర్న్లే ఎఫ్ సి 1-2 మాంచెస్టర్ సిటీ
లిసెస్టర్ సిటీ 2-2 మిడిల్స్ బ్రో
స్వాన్‌సి సిటీ 5-4 క్రిస్టల్ ప్యాలెస్
హుల్ సిటీ 1-1 వెస్ట్ బ్రాన్
లివర్ పూల్ 2-0 సండర్లాండ్
చెల్సియా 2-1 తోతహామ్ హట్సుపుర్
ఆదివారం, నవంబర్ 27
వాట్ ఫోర్డ్ 0-1 స్టాక్ సిటీ
ఆర్నెనల్ 3-1 బోర్నీ మౌత్
సౌతాంప్టన్ 1-0 ఎవర్టెన్
మాంటెస్టర్ యునైటెడ్ 1-1 వెస్ట్ హామ్