ఫిఫా విశ్వవిజేతగా ఇంగ్లాండ్: ఫైనల్లో స్పెయిన్‌పై విజయం, మ్యాచ్ హైలెట్స్ ఇవే
హైదరాబాద్: భారత్ తొలిసారిగా ఆతిథ్యం ఇచ్చిన ఫిఫా అండర్-17 వరల్డ్‌కప్ విజేతగా ఇంగ్లాండ్ నిలిచింది. టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్ పైనల్లో 5-2తో స్పెయిన్‌ను ఓడించి తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. మ్యాచ్ ఆరంభంలో రెండు గోల్స్‌తో వెనుకబడినా, ఏమాత్రం అధైర్యపడకుండా పట్టుదలతో పోరాడిన ఇంగ్లండ్ ట్రోఫీని నెగ్గింది.
శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన పైనల్లో ఇంగ్లాండ్ కళ్లు చెదిరే ప్రదర్శన చేసింది. టోర్నీలో అసాంతం ఓటమే తెలియని ఇంగ్లాండ్ జట్టు ఫైనల్లో కూడా చెలరేగింది. హోరాహోరీగానే సాగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 5-2తో స్పెయిన్‌పై ఘన విజయం సాధించింది.
ఇంగ్లండ్ తరపున ఫిల్ ఫోడెన్ (69వ, 88వ) డబుల్ గోల్స్ చేయగా.. బ్రూస్టర్ (44వ), గిబ్స్ వైట్ (58వ), గ్యూహీ (84వ) గోల్స్ కొట్టారు. స్పెయిన్ స్టార్ ప్లేయ్ సెర్గియో గోమెజ్ (10వ, 31వ) రెండు గోల్స్ సాధించాడు. ఈ విజయంతో ఇంగ్లాండ్ ఒకే ఏడాదిలో ఫిఫా డబుల్ సాధించినట్లయింది.
ఇంగ్లాండ్ జూన్‌లో ఫిఫా అండర్-20 ప్రపంచకప్ గెలిచింది. కాగా, బ్రూస్టర్ 8 గోల్స్‌తో టోర్నీలో టాప్ స్కోరర్‌గా గోల్డెన్ బూట్ గెలుచుకున్నాడు. గోల్డెన్ బాల్ ఫోడెన్ (ఇంగ్లండ్), గోల్డెన్ గ్లవ్ గాబ్రియెల్ బ్రాజో (బ్రెజిల్) దక్కించుకున్నారు. ఫైనల్ మ్యాచ్ కావడంతో స్టేడియం పూర్తి సామర్థ్యం 66,684 మందితో నిండిపోయింది.

ఇరు జట్లు దూకుడు
పైనల్లో ఆరంభం నుంచే ఇరు జట్లు దూకుడుని ప్రదర్శించాయి. 5వ నిమిషంలో స్పెయిన్ టికి-టకా పాసింగ్‌తో ఇంగ్లండ్ పోస్టుపై దాడి చేసింది. అయితే బ్రూస్టర్, ఫోడెన్, వైట్ వారి నుంచి బంతిని తప్పించగలిగారు. కానీ, 10వ నిమిషంలో జువాన్ మెరిండా క్రాస్‌ను అందుకున్న గోమెజ్.. ఇంగ్లండ్ పోస్టుకు అతి సమీపం నుంచి బంతిని నెట్‌లోకి పంపి స్పెయిన్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపా

44వ నిమిషంలో ఇంగ్లాండ్‌కు బ్రేక్
ఆ తర్వాత అతడే 31వ నిమిషంలో అబెల్ రుయిజ్ నుంచి బంతిని అందుకున్న అతడు ఎడమకాలితో గోల్ కొట్టడంతో స్పెయిన్ 2-0 ఆధిక్యం సాధించింది. అయితే విరామానికి ఒక్క నిమిషం ముందు అంటే 44వ నిమిషంలో డబుల్ హ్యాట్రిక్ బోయ్ రియాన్ బ్రూస్టర్ ఇంగ్లాండ్‌కు బ్రేక్ అందించాడు. కుడి వైపు నుంచి సెసెగ్‌నాన్ ఇచ్చిన చక్కని క్రాస్‌ను అతడు తలతో నెట్లోకి కొట్టాడు.

రెండో అర్ధభాగంలో పూర్తిగా మారిపోయిన ఆట
ఇక రెండో అర్ధభాగంలో ఆట స్వరూపమే పూర్తిగా మారిపోయింది. దూకుడు అమాంతం పెంచిన ఇంగ్లాండ్ మరితంగా రెచ్చిపోయింది. వరుస దాడులతో స్పెయిన్ డిఫెన్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిది. చకచకా నాలుగు గోల్స్ కొట్టి 5-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 58వ నిమిషంలో వైట్ 2-2తో స్కోరు సమం చేశాడు.

స్పెయిన్ డిఫెన్స్‌ను కకావికలం చేసిన ఇంగ్లాండ్ జట్టు
సెసెగ్‌నో లోక్రాస్‌ను అందుకున్న వైట్.. నేరుగా గోల్ చేసి 2-2తో స్కోరు సమం చేశాడు. ఇక్కడి నుంచి మరింత దూకుడు పెంచిన ఇంగ్లాండ్ జట్టు స్పెయిన్ డిఫెన్స్‌ను కకావికలం చేసింది. 69వ నిమిషంలో ఫొడెన్ గోల్‌తో 3-2 ఆధిక్యం సంపాదించింది. 84వ నిమిషంలో ఇంగ్లండ్ నాలుగో గోల్ సాధించింది.

30 నిమిషాల వ్యవధిలోనే నాలుగు గోల్స్ కొట్టిన ఇంగ్లాండ్
ఇలా, ఇంగ్లాండ్ 30 నిమిషాల వ్యవధిలోనే నాలుగు గోల్స్ కొట్టి స్పెయిన్‌కు మ్యాచ్‌ను దూరం చేసింది. మరో నాలుగు నిమిషాల తర్వాత ఫోడెన్ రెండో గోల్ చేయడంతో ఇంగ్లండ్ సంబరాలు చేసుకుంది. టోర్నీలో ఇంతవరకు క్వార్టర్స్ దాటని ఇంగ్లాండ్ జట్టు ఫైనల్‌కు చేరిన తొలిసారే విశ్వవిజేతగా అవతరించింది.

మూడో స్ధానంలో బ్రెజిల్
టోర్నీకి ముందు ఫేవరేట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ కాంస్యంతో సరిపెట్టుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో బ్రెజిల్ 2-0తో మాలిని ఓడించింది. 55వ నిమిషంలో అలెన్, 88వ నిమిషంలో యూరి అల్బర్టో గోల్స్‌తో బ్రెజిల్‌ను గెలిపించాడు.

హాజరులో కొత్త చరిత్ర
అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన టోర్నీగా ఇది రికార్డుల్లోకెక్కింది. ఈ టోర్నీని మొత్తం 13,47,143 మంది వీక్షించారు. 1985లో చైనాలో జరిగిన టోర్నీకి 12,30,976 మంది హాజరయ్యారు. ఇప్పటిదాకా అదే రికార్డు. అప్పటికంటే అదనంగా 1,16,167 ప్రస్తుత టోర్నీని ప్రత్యక్షంగా చూడటం విశేషం. అండర్-20 ప్రపంచకప్ రికార్డు (13,09,929, కొలంబియా-2011)ను కూడా ప్రస్తుత టోర్నీ దాటేసింది. సీనియర్ స్థాయి కాకుండా ఏ వయసు విభాగంలోనైనా ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో కూడా ఇదే రికార్డు.

టోర్నీలో మొత్తం నమోదైన గోల్స్ 179
ఈ టోర్నీలో మొత్తం 52 మ్యాచ్‌ల్లో 177 గోల్స్ నమోదయ్యాయి. అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ అయిన టోర్నీ ఇదే. 2013 అమెకారిలో జరిగిన టోర్నీ 172 గోల్స్ రికార్డును ఈ టోర్నీ అధిగమించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications