ఫిఫా వరల్డ్ కప్ 2018: పనామా పెద్దోళ్లు.. నైజీరియా చిన్నోళ్లు

హైదరాబాద్: ఫుట్‌బాల్ క్రీడా సంరంభానికి వేళైంది. మరో వారం రోజులలోపే రష్యా వేదికగా ప్రపంచకప్ అభిమానుల ముందుకొస్తుంది. ఈ తరుణంలో జట్ల సామర్థ్యాన్ని అంచనా వేయడం మొదలుపెట్టారు విశ్లేషకులు.
ఫిఫా వరల్డ్‌కప్-2018 కోసం 32దేశాలు ఎనిమిది గ్రూపులుగా విడిపోయి సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో జట్లన్నీ ఒక్కొక్కటిగా తమ ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో జట్టులోని ఆటగాళ్ల సగటు వయస్సును ఒకసారి పరిశీలిస్తే.. ఈ వరల్డ్‌కప్‌లో అత్యంత పిన్న వయస్కులతో నైజీరియా జట్టు బరిలోకి దిగుతోంది. ఈ జట్టులోని ఆటగాళ్ల సగటు వయస్సు 25.9కావడం విశేషం. పిన్న వయస్కుల జాబితాలో నైజీరియా తర్వాత ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు నిలిచాయి.

యువ ఆటగాళ్లతోనే ఫ్రాన్స్.. జర్మనీని:
ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత అనుభవం ఉన్న ఇంగ్లాండ్, ఫ్రాన్స్ జట్లలో.. ఆటగాళ్ల సగటు వయస్సు 26మాత్రమే. అయితే అనుభవం తక్కువ ఉన్న ఆటగాళ్లతో ఫ్రాన్స్ ఈసారి కప్ సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే ఆ జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఇప్పటికే 40కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లాడేసి మంచి అనుభవాన్ని సంపాదించారు. దీనికితోడు యువ ఆటగాళ్లతోనే ఫ్రాన్స్ గత ప్రపంచ కప్ విజేత జర్మనీని ఇటీవల జరిగిన టోర్నీల్లో రెండుసార్లు ఓడించి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది.

ఒక్క ఆటగాడు మాత్రమే 40కి పైగా:
ఇంగ్లాండ్ జట్టులో కేవలం ఒక్క ఆటగాడు మాత్రమే 40కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన అనుభవం ఉంది. ఇదిలా ఉండగా పనామా, కోస్టారికా జట్లు ఎక్కువ వయస్సు ఉన్న ఆటగాళ్లతో చివరి స్థానంలో నిలిచాయి. ఈ జట్లలోని ఆటగాళ్ల సగటు వయస్సు 29.6 ఉండటం గమనార్హం. అయితే పనామా జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఏకంగా 100కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన అనుభవం కూడా ఉంది.

వరల్డ్‌కప్‌లో ఎక్కువ వయస్సున్న ఆటగాడిగా
జట్లతో సంబంధం లేకుండా టోర్నీల్లో పాల్గొనే ఆటగాళ్ల పరంగా చూసుకుంటే ఈ వరల్డ్‌కప్‌లో ఎక్కువ వయస్సున్న ఆటగాడిగా ఈజిప్టు గోల్‌కీపర్ ఎసమ్ ఎల్-హడ్రే(45) నిలవగా, ఆస్ట్రేలియా ఆటగాడు డానియేల్ అర్జానీ(19) అత్యంత పిన్న వయస్కుడిగా నమోదయ్యాడు. అతనితో పాటుగా మరో నలుగురు కూడా 19ఏళ్ల వయస్కులే. వీరిలో ఒక గోల్‌కీపర్ కూడా ఉన్నాడు. అతనే నైజీరియాకు చెందిన ఫ్రాన్సిస్ ఉజో(19).

టోర్నీలో అత్యధిక వరల్డ్‌కప్(5) లాడిన వెటరన్ ఆటగాడిగా:
ఇక మెక్సికోకు చెందిన రఫెల్ మార్కిజ్(39) ఈ సారి కూడా వరల్డ్‌కప్ ఆడనున్నాడు. దీంతో ఈ టోర్నీలో అత్యధిక వరల్డ్‌కప్(5) లాడిన వెటరన్ ఆటగాడిగా ఇతను నిలవనున్నాడు. ఈజిప్టుకు చెందిన ఎస్సామ్ అల్ హడ్రే రష్యా జట్టుకు 28 ఏళ్లు దూరంగా ఉంటుూ మళ్లీ ఈ టోర్నీ ద్వారా జట్టులో భాగమై ప్రపంచ కప్‌లో భాగస్వామ్యం కానున్నాడు. ఈ సందర్భంగా ఎస్సామ్ మాట్లాడుతూ.. 'మా జట్టు కేవలం ప్రపంచ కప్ పాల్గొంటే చాలనుకోవట్లేదు. ముందు రౌండ్ 16కు అర్హత సాధించాలనేదే మా లక్ష్యం' అని పేర్కొ్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications