ఇంగ్లాండ్‌లో కబడ్డీ ఆడుతున్న ఫుట్‌బాల్ ప్లేయర్లు(వీడియో)

హైదరాబాద్: క్రికెటర్లు, షట్లర్లు బోర్ కొట్టకుండా, లేదా ఇంకా మెరుగైన ఫిట్‌నెస్ కోసం వేరే ఆటలేవైనా ఎంచుకుంటారు. ఇలాగే భారత క్రికెటర్లు ప్రాక్టీస్ చేసే సమయంలో ఫుట్‌బాల్ ఆడటం మనం ఎన్నోసార్లు చూశాం. టీమిండియాలోని ఎంతో మంది ఆటగాళ్లకు ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం కూడా. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని వాళ్లే చెప్పారు. ఇక ధోనీ గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు ధోనీ ఎక్కువగా ఫుట్‌బాలే ఆడేవాడట.
ఆ మధ్య బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ ప్రాక్టీస్ సమయంలో అప్పుడప్పుడు క్రికెట్ ఆడుతుంటామని చెప్పాడు. ఇలా మనవాళ్లు విరామ సమయాల్లో.. మార్పు కోసం విదేశీ ఆటలవైపు మొగ్గు చూపుతుంటే వాళ్లేమో భారత క్రీడలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఎలాగంటే.. మరికొద్ది రోజుల్లో రష్యాలో ఫిఫా ప్రపంచకప్ ప్రారంభంకాబోతోంది. ఇప్పటికే టోర్నీలో పాల్గొనే జట్లన్ని ఆతిథ్య దేశానికి చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.
ఐతే, ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అదేంటంటే.. ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో భాగంగా కబడ్డీ ఆడుతూ కనిపించారు. భారత్‌లో పుట్టిన ఈ క్రీడను ఇంగ్లిష్ ఆటగాళ్లు ఆడటం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
'ఈ వీడియో చూశారా; ఇందులో కబడ్డీ ఆడేది ఎవరో కనిపెట్టండి; ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో భాగంగా మన కబడ్డీ ఆడుతున్నారు; ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో కబడ్డీ ఫీవర్' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రొకబడ్డీ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి కబడ్డీ ఆదరణ క్రమంగా పెరుగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications