For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Euro 2020: హ్యారీ కేన్‌ డబుల్‌ గోల్స్‌.. యూరో కప్‌ సెమీస్‌లో ఇంగ్లండ్‌!!

England enters Euro 2020 semi-final vs Denmark

రోమ్‌: యూరో కప్‌ 2021 టోర్నీలో ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ జట్టు 25 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఉక్రెయిన్‌తో జరిగిన చివరి క్వార్టర్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ 4-0 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్‌ తరఫున కెప్టెన్‌ హ్యారీ కేన్‌ రెండు గోల్స్‌ (4వ, 50 ని.లో) చేయగా.. మగురె (46వ ని.లో), హెండర్సన్‌ (63వ ని.లో) ఒక్కో గోల్‌ కొట్టారు. బుధవారం లండన్‌లో జరిగే సెమీ ఫైనల్లో డెన్మార్క్‌తో ఇంగ్లండ్‌ ఆడుతుంది.

4వ నిమిషంలో హ్యారీ కేన్‌ గోల్‌తో సత్తాచాటగా.. రెండో అర్ధభాగం తొలి నిమిషంలోనే హ్యారీ మగురే ఇంగ్లిష్‌ జట్టు ఆధిక్యాన్ని డబుల్‌ చేశాడు. కేన్‌ (50వ నిమిషంలో) మరో గోల్‌తో మెరువగా.. జాతీయ జట్టులోకి వచ్చిన దశాబ్దం తర్వాత జోర్జాన్‌ హెండర్సన్‌ తొలి గోల్‌ నమోదు చేసి గెలుపు ఖాయం చేశాడు. ఇంగ్లండ్‌ దూకుడైన ఆటకు ఉక్రెయిన్‌ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.

ఇప్పటివరకు ఒక్కసారి కూడా యూరో కప్‌ టైటిల్‌ కొట్టలేకపోయిన ఇంగ్లండ్‌.. చివరిసారి ఈ టోర్నీలో 1996లో సెమీ ఫైనల్‌ చేరింది. 1966 ప్రపంచకప్‌ ఫైనల్లో పశ్చిమ జర్మనీపై 4-2తో గెలిచిన తర్వాత ఇంగ్లండ్‌ జట్టు ఓ పెద్ద టోర్నీ నాకౌట్‌ మ్యాచ్‌లో నాలుగు గోల్స్‌ చేయడం ఇదే ప్రథమం. పటిష్ట డెన్మార్క్‌తో ఇంగ్లండ్‌ తలపడనుంది కాబట్టి.. ఇంగ్లీష్ ఆటగాళ్లు సత్తాచాటితేనే మ్యాచ్ నెగ్గగలరు.

లియోనియాల్ మెస్సి సత్తా చాటడంతో కోపా అమెరికా కప్‌లో అర్జెంటీనా సెమీపైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ఆ జట్టు 3-0తో ఈక్వెడార్‌ను ఓడించింది. 38వ నిమిషంలో రోడ్రిగో కొట్టిన గోల్‌తో అర్జెంటీనా ఖాతా తెరిచింది. 84వ నిమిషంలో మార్టినెజ్‌ జట్టు ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. అదనపు సమయంలో అర్జెంటీనా ఆటగాడిని కావాలనే అడ్డుకున్నాడన్న కారణంగా ఈక్వెడార్‌ ఆటగాడు పియరోకు రిఫరీ రెడ్‌ కార్డు చూపించాడు. ఇలా లభించిన పెనాల్టీ కిక్‌ను మెస్సి (93వ నిమిషం) సద్వినియోగం చేస్తూ గోల్‌ కొట్టి అర్జెంటీనా తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు.

Story first published: Monday, July 5, 2021, 7:51 [IST]
Other articles published on Jul 5, 2021
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+