న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫుట్‌బాల్‌ లెజెండ్ జాక్‌ చార్లటన్‌‌ కన్నుమూత!!

England 1966 World Cup winner Jack Charlton dies, aged 85

లండన్: ఇంగ్లండ్ 1966 ప్రపంచకప్ విజేత, లెజెండరీ ఫుట్‌బాల్‌ ఆటగాడు జాక్‌ చార్లటన్‌ కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. జాక్‌ శుక్రవారం కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ ఐర్లాండ్ మేనేజర్ జాక్.. గత సంవత్సర కాలంగా లింఫోమా కాన్సర్‌, డిమెన్షియాతో బాధపడుతున్నారు. జాక్‌ మృతితో ఫుట్‌బాల్ ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. ప్రపంచం నలుమూలల నుంచి వివిధ ఫుట్‌ బాల్‌​ క్లబ్‌లు, ఆటగాళ్లు ఆయన మృతికి నివాళులు అర్పించారు.

జాక్ చార్లటన్‌‌ మృతిపై ఆయన మనవరాలు, జర్నలిస్ట్ ఎమ్మా విల్కిన్‌ సన్‌ ట్విటర్‌ ద్వారా నివాళులర్పించారు. 'తాతయ్య (జాక్ చార్లటన్‌‌) మరణించారు. చాలా బాధగా ఉంది. ఆయన ఓ ఫుట్‌బాల్‌ లెజెండ్. ఎంతో మంచి వారు. చాలా సరదాగా ఉండేవారు. జ్ఞాపకాలకు కృతజ్ఞతలు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా' అని విల్కిన్‌ సన్‌ ట్వీట్ చేశారు. లీడ్స్ యునైటెడ్‌తో పాటు ఫుట్‌బాల్‌ ప్రేమికులు, అభిమానులు జాక్‌కు ట్విటర్‌ ద్వారా నివాళులర్పించారు.

అద్భుతమైన డిఫెండర్‌గా రాణించిన జాక్ చార్లటన్‌..‌ లీడ్స్ యునైటెడ్‌కు 21 సంవత్సరాల పాటు సేవ చేశారు. మొత్తంగా 773 ఆటలను ఆడారు. 1973లో ఆటగాడిగా పదవీ విరమణ చేసి.. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ మేనేజర్‌గా దశాబ్దం పాటు సేవలందించారు. ఇటలీలో జరిగిన 1990 ప్రపంచకప్‌లో జట్టును క్వార్టర్ ఫైనల్స్‌కు తీసుకెళ్లిన ఘనత జాక్‌ది. జాక్ కుటుంబంతో పాటు నార్తమ్‌బెర్లాండ్‌లో ఉన్నారు. జాక్ మంచి భర్త, తండ్రి, తాత మరియు ముత్తాతగా గుర్తింపు పొందారు.

'ధోనీ నమ్మకాన్ని ఓ ప్లేయర్ పొగొట్టుకుంటే.. ఇక దేవుడు కూడా సాయం చేయలేడు''ధోనీ నమ్మకాన్ని ఓ ప్లేయర్ పొగొట్టుకుంటే.. ఇక దేవుడు కూడా సాయం చేయలేడు'

Story first published: Saturday, July 11, 2020, 16:01 [IST]
Other articles published on Jul 11, 2020
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X