Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇటలీని నిలువరించిన న్యూజీల్యాండ్, మ్యాచ్ డ్రా

Riccardo Montolivo
నెల్‌ స్ప్రూట్‌: న్యూజిల్యాండ్- ఇటలీ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆదివారం గ్రూప్‌ 'ఎఫ్‌'లో జరిగిన పోరులో ఆల్‌ వైట్స్‌ (న్యూజిలాండ్‌) 1-1 గోల్స్‌తో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇటలీని నిలువరించింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఇటలీ (5వ ర్యాంకు) కన్నా 74 స్థానాలు వెనకున్న న్యూజిలాండ్‌ (79వ ర్యాంకు)..స్మెల్జ్‌ ఏడో నిమిషంలో చేసిన గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ 29వ నిమిషంలో పెనాల్టీని. డిన్సెంజె ఇకింటా గోల్‌గా మలవడంలో ఇటలీ వూపిరిపీల్చుకుంది.

ఆ తర్వాత ఇటలీ ఎంత ప్రయత్నించినా విజయానికి కావాల్సిన గోల్‌ సాధించలేకపోయింది. వరుసగా రెండో మ్యాచ్ ‌నూ కూడా డ్రా చేసుకున్న ఇటలీ, న్యూజిలాండ్‌లకు ఇంకా నాకౌట్‌కు చేరే అవకాశాలున్నాయి. చివరి మ్యాచ్‌లో స్లొవేకియాతో ఇటలీ.. పరాగ్వేతో న్యూజిలాండ్‌లు తలపడతాయి. గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ముందుకెళ్తాయి.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+