FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన ఈజిప్ట్.. న్యూజిలాండ్‌పై ఘన విజయం!
ఈజిప్ట్ ఫుట్‌బాల్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-జీలో భాగంగా సోమవారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్‌లో ఈజిప్ట్ 3-1 తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. స్టార్ ప్లేయర్, కెప్టెన్ మహమ్మద్ సలాహ్ అద్భుత ప్రదర్శనతో ఈజిప్ట్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో గ్రూప్-జీ పాయింట్స్ టేబుల్‌లో ఈజిప్ట్ అగ్రస్థానంలో నిలిచి నాకౌట్ అవకాశాలను మెరుగుపర్చుకుంది.
బిసి ప్లేస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరంభంలో ఈజిప్ట్‌కు గట్టి షాక్ తగిలింది. 15వ నిమిషంలోనే న్యూజిలాండ్ డిఫెండర్ ఫిన్ సుర్మాన్ హెడర్ ద్వారా గోల్ చేసి ఆ జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. కానీ ఈజిప్ట్ ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ముస్తఫా జికో, సలాహ్ జోడి ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదిస్తూ గోల్‌పోస్ట్‌పై దాడులు చేశారు.

సలాహ్ మార్క్ మ్యాజిక్..
సెకండాఫ్‌లో ఈజిప్ట్ ఆట స్వరూపమే మారిపోయింది. 58వ నిమిషంలో ముస్తఫా జికో పవర్‌ఫుల్ హెడర్‌తో స్కోరును 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సలాహ్ క్లాసిక్ కౌంటర్ ఎటాకింగ్‌తో గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దీంతో ఈజిప్ట్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక 82వ నిమిషంలో సలాహ్ అందించిన కార్నర్ పాస్‌ను సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ట్రెజెగెట్ గోల్‌గా మలిచి 3-1తో ఈజిప్ట్ విజయాన్ని ఖాయం చేశాడు.
సరికొత్త రికార్డ్..
ఈ మ్యాచ్‌తో మహమ్మద్ సలాహ్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు వేర్వేరు ప్రపంచకప్‌ల్లో గోల్స్ చేసిన తొలి ఈజిప్ట్ ఆటగాడిగా నిలిచాడు. అలాగే వరల్డ్ కప్‌లో ఈజిప్ట్ తరఫున అత్యధిక గోల్స్ (3 గోల్స్) చేసిన ప్లేయర్‌గా సలాహ్ రికార్డు సృష్టించాడు. ఈజిప్ట్ ఒకే ప్రపంచకప్ మ్యాచ్‌లో మూడు గోల్స్ చేయడం కూడా ఇదే తొలిసారి.
తదుపరి మ్యాచ్‌లో ఇరాన్‌తో జరిగే పోరును డ్రా చేసుకున్నా ఈజిప్ట్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు, బెల్జియం-ఇరాన్ మ్యాచ్ డ్రా కావడంతో.. చివరి మ్యాచ్‌లో బెల్జియంను ఓడిస్తే న్యూజిలాండ్‌కు కూడా నాకౌట్ అవకాశాలు ఉంటాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications