Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పుట్‌బాల్ మ్యాచ్‌లో లవ్ ప్రపోజల్: ఫ్యాన్స్ ఆశ్చర్యం, వీడియో వైరల్

 Eduard Bello proposes to girlfriend after scoring a goal playing for Antofagasta in Chile soccer league

హైదరాబాద్: ఫుట్‌బాల్‌ ప్రపంచంలో అత్యంత అభిమానులను కలిగి ఉన్న క్రీడ. పుట్‌బాల్ మ్యాచ్‌లో గోల్ చేసిన అనంతరం ఆటగాళ్లు చేసుకునే ఆ సంబరాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. తాజాగా వెనెజులాకు చెందిన స్ట్రైకర్ ఈ గోల్ సంబరాలకు కొత్త అర్ధం చెప్పాడు.

గోల్ కొట్టిన వెంటనే అతడు పరిగెత్తుకుంటూ వెళ్లి స్టాండ్స్‌లో ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్‌ దగ్గరకు వెళ్లి తన లవ్‌ను ప్రపోజ్ చేశాడు. వివరాల్లోకి వెళితే... చిలియన్ ప్రైమా డివిజన్ లీగ్‌లో సీడీ ఆంటోఫగస్టా జట్టుకు వెనెజులాకు చెందిన ఎడ్వర్డ్ బెలో అనే ఆటగాడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే అతడు గోల్ చేశాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వెంటనే స్టాండ్స్ వైపు అతను పరుగెత్తుకుంటా వెళుతున్నాడు. దీంతో అతడు ఏం చేస్తున్నాడో కాసేపు ఎవరికి అర్ధం కాలేదు. స్టాండ్స్‌లో ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్‌కు దగ్గరకు వెళ్లిన అతడు తన వద్ద ఉన్న రింగ్ ఆమె వేలికి పెట్టి ప్రపోజ్ చేశాడు.

దీనికి వెంటనే ఆమె కూడా అంగీకరించడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన ప్రేమను ఇలా వినూత్నంగా వ్యక్తం చేసిన బెలోని చూసి స్టేడియంలోని అభిమానులు చప్పట్లతో అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

Story first published: Wednesday, October 31, 2018, 13:54 [IST]
Other articles published on Oct 31, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+