Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Fifa World Cup 2022 : ఫిఫా వరల్డ్ కప్‌లో ఈక్వెడార్‌కు అదిరే ఆరంభం.. ఆతిథ్యం ఇస్తున్న ఖతర్‌ చిత్తు

 Ecuador captain scores two goals to defeat hosts Qatar in Fifa World Cup 2022 opening game

ప్రపంచంలో అత్యంత పాపులర్ స్పోర్ట్ ఫుట్‌బాల్. మరి అంత పాపులర్ క్రీడలో వరల్డ్ కప్ అంటే ఆ మజా మామూలుగా ఉంటుందా? ఆదివారం నాడు అదే జరిగింది. అంగరంగ వైభవంగా వరల్డ్ కప్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఖతర్‌తో ఈక్వెడార్ పోటీ పడింది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం ఈక్వెడార్‌నే వరించింది. ఆ జట్టు సారధి ఎన్నర్ వాలెన్షియా అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు.

జట్ల హిస్టరీ..

జట్ల హిస్టరీ..

ఈ మ్యాచ్‌కు ముందు వివిధ టోర్నీల్లో ఖతర్ ఆడిన చివరి ఐదు మ్యాచుల్లో ఒక విజయం, రెండు డ్రాలు, రెండు పరాజయాలతో నిలిచింది. అదే సమయంలో ఈక్వెడార్ తన చివరి ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో ఒక్క గోల్ కూడా లేకుండా డ్రా చేసుకోగా, ఒక మ్యాచ్‌ను 1-0తో గెలుచుకుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఈక్వెడార్ జట్టే ఫేవరెట్‌గా బరిలో దిగింది. మ్యాచ్ మొదలైన 15 నిమిషాలకే ఫలితం ఈక్వెడార్ వైపు మొగ్గింది.

ఈక్వెడార్ ఎటాకింగ్ గేమ్..

ఈక్వెడార్ ఎటాకింగ్ గేమ్..

ఆట మొదలు పెట్టిన ఈక్వెడార్ ఎటాకింగ్ ఆటతీరు కనబరిచింది. 15 నిమిషాలలోపే ఒక గోల్ కూడా చేసింది. అయితే ఆఫ్‌సైడ్ ఉండటంతో ఆ గోల్‌ను అంపైర్లు ఇవ్వలేదు. దీంతో కొంతసేపు అంపైర్‌తో ఆటగాళ్లు చర్చించారు. అభిమానులు కూడా ఈ నిర్ణయంతో షాకయ్యారు. కానీ రిప్లేలు చూసిన తర్వాత అందరూ మిన్నకుండిపోయారు. అయితే ఈ ఘటన తర్వాత ఈక్వెడార్ కెప్టెన్ ఎన్నెర్ మరింత కసిగా ఆడాడు.

ఎన్నెర్ డబుల్ ధమాకా..

ఎన్నెర్ డబుల్ ధమాకా..

ఈ ఘటన జరిగిన మరో 16 నిమిషాల్లోనే ఎన్నెర్ మరో గోల్ చేశాడు. దీంతో ఈక్వెడార్ జట్టు 1-0 లీడ్‌లోకి వెళ్లింది. మ్యాచ్ ఆసాంతం ఖతర్ గోల్‌పోస్ట్‌పై ఈక్వెడార్ ఆటగాళ్లు ఎటాక్ చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత మరో 15 నిమిషాల్లోనే ఎన్నెర్ మరో గోల్ కొట్టడంతో ఆధిక్యం 2-0 అయింది. సెకండ్ హాఫ్‌లో తమ ఆధిక్యాన్ని ఈక్వెడార్ చక్కగా డిఫెండ్ చేసుకుంది. సెకండ్ హాఫ్‌లో కేవలం ఒక్కసారి మాత్రమే ఈక్వెడార్ ఆటగాళ్లు గోల్ షాట్ కొట్టారు. కానీ ఖతర్ గోల్ కీపర్ దాన్ని అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఆట అంత ఉత్కంఠగా ఏం సాగలేదు.

ఖతర్ ఓటమి..

ఖతర్ ఓటమి..

ఈక్వెడార్ జట్టు తమ ఆధిక్యాన్ని కాపాడుకోవడంతో ఆతిథ్య ఖతర్‌ తమ తొలి మ్యాచ్‌లో ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ఈక్వెడార్ కెప్టెన్ ఎన్నెర్ వాలెన్షియా రెండు గోల్స్‌తో తమ జట్టును గెలిపించుకున్నాడు. దీంతో అతనికే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. అంతేకాదు, ప్రపంచకప్‌లలో ఒక దక్షిణ అమెరికా దేశం తరఫున వరుసగా ఐదు గోల్స్ చేసిన ఆటగాడిగా కూడా ఎన్నెర్ రికార్డు నెలకొల్పాడు.

Story first published: Monday, November 21, 2022, 8:45 [IST]
Other articles published on Nov 21, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+