For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'అతనితో కలిసి ఆడటం మరిచిపోలేని అనుభవం'

బార్సిలోనా స్టార్ ప్లేయర్ లియానెల్ మెస్సితో కలిసి ఆడటం మరిచిపోలేని అనుభవం అని అర్జెంటీనా ఫార్వర్డ్ ప్లేయర్ పాలో ద్యాబాలా అన్నాడు.

By Nageshwara Rao

బార్సిలోనా: బార్సిలోనా స్టార్ ప్లేయర్ లియానెల్ మెస్సితో కలిసి ఆడటం మరిచిపోలేని అనుభవం అని అర్జెంటీనా ఫార్వర్డ్ ప్లేయర్ పాలో ద్యాబాలా వ్యాఖ్యానించాడు. అర్జెంటీనాకు చెందిన లియానెల్ మెస్సి తమకందరికీ ఆరాధ్యనీయుడైన ఆటగాడన్నారు. ఇటాలియన్ దినపత్రిక కొర్రిరె డెల్లో స్పోర్ట్‌కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

అర్జెంటీనియన్లందరికీ మెస్సి ఆదర్శమని చెప్పాడు. తామంతా ఎఫ్ సి బార్సిలోనా మాంత్రికుడు మెస్సితో కలిసి ఆడాలని కలలు కంటుంటామని చెప్పారు. 'అర్జెంటీనా తరఫున ఆయనతో కలిసి ఆడటం నేనెప్పటికి మరిచిపోలేను. మ్యాచ్‌లో బంతిని గోల్ పోస్ట్ వరకు పాస్‌ చేయడంలో ఆయన టాప్‌లో ఉంటారు. ఆయన బంతిని షూట్ చేసేందుకు నేను సెట్ చేశాను' అని ద్యాబాలా గుర్తుచేసుకున్నాడు.

ప్రపంచంలోకెల్లా ఉత్తమ ఫుట్ బాల్ ఆటగాళ్లు లియానెల్ మెస్సీ, పోర్చుగీస్‌కు చెందిన క్రిస్టియానో రొనాల్డో అని చెప్పారు. బాల్లోన్ డి'ఓర్ అవార్డుకు నామినేషన్‌తోపాటు క్రిస్టియానో రొనాల్డో, లియానెల్ మెస్సి స్థాయికి ఎదగాలన్నదే తన స్వప్నమని వ్యాఖ్యానించాడు.

ఈ ఏడాదిలో అవార్డు కోసం నామినేషన్ పంపిన ద్యాబాలా.. బాల్లోన్ డి'ఓర్ షార్ట్ లిస్ట్ - 30లో చోటు దక్కించుకున్నా అద్భుతమైనన్నాడు. ఈ ఏడాది తనకు ఎవరూ ఓటేయలేదన్నాడు. ఫుట్ బాల్ ఆటలో ఉన్నత స్థానానికి ఎదగాలన్నదే తన లక్ష్యమని, ఎప్పటికైనా అర్జెంటీనా జాతీయ జట్టు జెర్సీని ధరించాలని కల కంటున్నట్లు చెప్పాడు.

Dybala says first time playing with Messi was unforgettable experience

అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ కొంకా కోసం షాంఘై ఎస్ఐపిజి యత్నం

అర్జెంటీనా మిడ్ ఫీల్డర్ డారియో కొంకాను జట్టులో చేర్చుకునేందుకు చైనీస్ సూపర్ లీగ్ ఫ్రాంచైసీ షాంఘై ఎస్ఐపిజి ఫ్రాంచైసీ యత్నిస్తోంది. దీని తరఫున బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్లబ్ ఫ్లమెంగో ఆయనతో సంప్రదింపులు జరుపుతోంది. ఇంతకుముందు షజియాజ్ యుయాంగ్ పై జరిగిన మ్యాచ్ లో షాంఘై ఎస్ఐపిజి 4 -1 స్కోర్‌తో విజయం సాధించిన మ్యాచ్‌లో ఈ 33 ఏళ్ల కుర్రాడు కొంకాకు మోకాలి కండరాలు పట్టేశాయి.

అప్పటి నుంచి ఫుట్‌బాల్ మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు. వచ్చే ఏడాది మార్చి వరకు ఆయన తిరిగి మ్యాచ్‌లో పాల్గొనే అవకాశాలు లేవని చైనా అధికార వార్తాసంస్థ 'జిన్హువా' పేర్కొంది. బ్రెజిలియన్ దినపత్రిక యొల్ ఎస్పోర్టె కథనం ప్రకారం రియోలో జరిగే టోర్నీలో ఫ్లమెంగో జట్టుకు రెండు వేర్వేరు మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహిస్తాడని తెలుస్తున్నది.

కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం కొంకాకు ఫ్లమెంగో యాజమాన్యం ఏడాది వేతనం చెల్లించాల్సి ఉన్నది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందులో సగానికంటే తక్కువగా ఫీజు ఏడాదికి 11 మిలియన్ల డాలర్లు మాత్రమే ఫ్లమెంగో చెల్లించే అవకాశముంది. గత ఏడాది ఫ్లుమైనెన్స్ నుంచి షాంఘై ఎస్ఐపిజిలో చేరిన తర్వాత 46 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు.

బెంజెమా వినతికి ఫ్రాన్స్ కోర్టు నో
ఫ్రాన్స్ టీం సహచరుడు మాథ్యూ వాల్బౌనాపై సెక్స్ టేప్ ఫీచరింగ్ బ్లాక్ మెయిల్ కేసు ఉపసంహరించుకునేందుకు అనుమతించాలన్న రియల్ మాడ్రిడ్ స్ట్రయికర్ కరీం బెంజెమా, ఇతర డిపెండెంట్ల వినతిని ఫ్రాన్స్ల్ లోని విరాసైల్లెస్ న్యాయస్థానం తిరస్కరించింది. వచ్చే ఏడాది ఈ కేసు విచారణకు రానున్నది. డిఫెండెంట్ లాయర్ అభ్యర్థనను న్యాయస్థానం దర్యాప్తు విభాగం తిరస్కరించినందని ప్రాసిక్యూషన్ ఆఫీస్ అధికార ప్రతినిధి తెలిపారు.

ఈ కేసులో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని ప్రాసిక్యూషన్ నమ్ముతోంది. బ్లాక్ మెయిల్ కు పాల్పడిన వారికి కొంత సొమ్ము చెల్లించేందుకు రియల్ మాడ్రిడ్ ప్లేయర్ ప్రయత్నిస్తున్నాడని ప్రాసిక్యూషన్ ఆఫీస్ చెప్తున్నది. కానీ బెంజెమా మాత్రం ఈ విషయాన్ని తిరస్కరిస్తున్నారు. తన లక్ష్యం పూర్తిగా వాల్బౌనాకు సాయం చేయడం మాత్రమేనన్నాడు.

తన ఫోన్ నుంచి ప్రైవేట్ కాల్స్ చేసుకునేందుకైనా అనుమతించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చారు. పోలీసులు బెంజెమా ఫోన్ టాప్ చేస్తున్నారు. ప్రస్తుతం జపాన్ లో క్లబ్ ప్రపంచ కప్ టోర్నీలో బెంజెమా పాల్గొంటున్నాడు. ఈ కేసు నేపథ్యంలోనే యూరో - 2016 కప్ టోర్నీకి బెంజెమాతోపాటు వాల్బౌనాను జట్టు మేనేజ్మెంట్ ఎంపికచేయలేదు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+