Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జపాన్ ను వోడించిన నెదర్లాండ్స్, నాకౌట్ కు చేరువలో

Wesley Sneijder
డర్బన్‌: నాకౌట్ కు చేరువలో నెదర్లాండ్స్ ఉంది. రెండుసార్లు ఫైనలిస్ట్‌ నెదర్లాండ్స్‌ (ఆరంజ్‌) వరుసగా రెండో విజయంతో రెండో రౌండ్‌ ముంగిట నిలిచింది. శనివారం గ్రూప్‌-ఎఫ్‌ మ్యాచ్ ‌లో నెదర్లాండ్స్‌ 1-0తో జపాన్‌ను ఓడించింది. స్నెడర్‌ (53వ నిమిషం) మ్యాచ్‌ లో ఏకైక గోల్‌ చేశాడు. తొలి మ్యాచ్‌ లో కామెరూన్‌ ను ఓడించి మెరుగ్గా కనిపించిన జపాన్‌ తాజా ఓటమితో నాకౌట్‌ దశ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. డెన్మార్క్ ‌తో చివరి మ్యాచ్‌ లో జపాన్‌ తప్పక గెలవాలి. మరోవైపు నెదర్లాండ్స్‌ ఆఖరి మ్యాచ్‌ (కామెరూన్ ‌తో)ను డ్రా చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ శనివారం అర్ధరాత్రి జరిగే మ్యాచ్ ‌లో డెన్మార్క్‌ ను కామరూన్‌ ఓడించకపోతే ప్రపంచకప్ ‌లో నాకౌట్‌ చేరబోతున్న తొలి జట్టు నెదర్లాండ్సే!

హాలెండ్‌ దూకుడు: మ్యాచ్‌ ఆరంభంలో నెదర్లాండ్స్‌ దూకుడు ప్రదర్శించింది. జపాన్‌ రక్షణశ్రేణిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. దాని ఫలితమే ఎనిమిదో నిమిషంలో ఫ్రీకిక్‌. జపాన్‌ డిఫెండర్లు రాబిన్‌ వాన్‌ పెర్సీని ప్రమాదకరంగా అడ్డుకోవడంతో డి ఏరియాకు దగ్గరగా డచ్‌కు ఫ్రీకిక్‌ లభించింది. వెస్లీ స్నెడర్‌ కొట్టిన షాట్‌ గోల్‌పోస్ట్‌పై నుంచి దూసుకెళ్లడంతో హాలెండ్‌కు తొలి అవకాశం చేజారింది. ఐతే వెంటనే డిర్క్‌ కుట్‌ బైస్కిల్‌ కిక్‌తో గోల్‌ ప్రయత్నం చేశాడు. కానీ జపాన్‌ డిఫెండర్లను దాటి బంతి ముందుకెళ్లలేదు. జపాన్‌ డిఫెన్స్‌ పటిష్ఠంగా ఉండబట్టి సరిపోయింది. లేదంటే తొలి అర్ధభాగంలోనే నెదర్లాండ్స్‌ ఖాతాలో ఒకట్రెండు గోల్స్‌ చేరేవి. అలాగని మ్యాచ్‌లో జపాన్‌ పూర్తిగా రక్షణాత్మకంగా వ్వవహరించలేదు. యుజి నకజవా, తొలి మ్యాచ్‌ హీరో కైసుకి హోండా డచ్‌ గోల్‌కీపర్‌ను పరీక్షించారు. వరుసగా దాడులు చేస్తూ హోండా డచ్‌ డిఫెండర్లను శ్రమించేలా చేశాడు.

మెరిసిన స్నెడర్‌: ప్రథమార్ధంలో నెదర్లాండ్స్‌ గోల్‌ చేయకుండా అడ్డుపడిన జపాన్‌ కు ద్వితీయార్ధంలో అది సాధ్యం కాలేదు. విరామం తర్వాత వరుసపెట్టి గోల్‌ ప్రయత్నాలు చేసిన డచ్‌కు త్వరగానే ఫలితం లభించింది. 53వ నిమిషంలో స్నెడర్‌ జట్టును 1-0 ఆధిక్యంలో నిలిపాడు. వాన్‌ పెర్సీ జపాన్‌ రక్షణశ్రేణిని ఛేదించుకుంటూ పాస్‌ అందించగా..స్నెడర్‌ బుల్లెట్‌ వేగంతో బంతిని గోల్‌ పోస్ట్‌ లోకి పంపాడు. గోల్ ‌కీపర్‌ కవాషిమా బంతిని అడ్డుకున్నా గోల్‌కాకుండా ఆపలేకపోయాదు. ఆధిక్యాన్ని సమం చేసేందుకు జపాన్‌ ఎదురుదాడికి దిగినా ఫలితం లేకపోయింది.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+