ఉరుగ్వే, నెదర్లాండ్స్ హోరాహోరీ నేడు
కేప్ టౌన్: ఉరుగ్వే, నెదర్లాండ్స్ ఈ రాత్రికి హోరాహోరీగా తలపడనున్నాయి. ఒక్క జట్టుకే ఫైనల్‌కు వెళ్లే అవకాశం. మంగళవారం కేప్ టౌన్ లో జరిగే తొలి సెమీఫైనల్లో ఈ జట్లు తలపడనున్నాయి. ఐతే తొలి ప్రపంచకప్ కోసం పరితపిస్తోన్న నెదర్లాండ్స్ జట్టే స్పష్టమైన ఫేవరెట్. క్వార్టర్స్‌లో బలమైన బ్రెజిల్‌పై పెను సంచలనం సృష్టించి డచ్ జట్టు సెమీస్ చేరగా.. ఘనాతో మ్యాచ్‌లో అదృష్టం ఉరుగ్వే పక్షాన నిలిచింది.
తిరుగులేని సమన్వయంతో, ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి రెట్టించిన విశ్వాసంతో ఉన్న నెదర్లాండ్స్‌ను ఓడించాలంటే ఉరుగ్వే అసాధారణంగా రాణించాల్సిందే. ఐతే 40 ఏళ్ల తర్వాత సెమీఫైనల్ చేరి దేశంలో ఫుట్‌బాల్‌కు తిరిగి ప్రాణం పోసిన ఉరుగ్వే పోరాడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ జట్టు గెలిచినా మూడోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంటుంది.
నెదర్లాండ్స్ ప్లస్
చక్కటి ఫామ్‌లో ఉంది. గత మూడు మ్యాచుల్లో 2-1 గోల్స్‌తో గెలిచింది. నెదర్లాండ్స్ బలమంతా మిడ్‌ఫీల్డ్‌లోనే ఉంది. సృజనాత్మకంగా కదిలే అర్జెన్ రాబెన్, వెస్లీ స్నైడర్ ఏ జట్టు డిఫెన్స్‌నైనా కకావికలం చేయగలరు. ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగల ప్రమాదకర ఆటగాళ్లు వీళ్లు. క్యుట్ కూడా మంచి ఫినిషర్. స్త్ట్రెకర్ రాబిన్ వాన్ పెర్సీ గాయం నుంచి కోలుకొని పూర్తి ఫిట్‌నెస్ సాధించడం నెదర్లాండ్స్‌కు శుభవార్త.
నెదర్లాండ్స్ మైనస్
నెదర్లాండ్స్ బలహీనత డిఫెన్సే. డచ్ రక్షణ శ్రేణికి కీలక సమయాల్లో తడబడే అలవాటుంది. టోర్నీలో ఇప్పటి వరకు మూడు గోల్సే ఇచ్చినప్పటికీ అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి.
ఉరుగ్వే ప్లస్
లుగానో, విక్టోరినో, మాక్సి పెరీరాలతో అత్యుత్తమ డిఫెన్స్ ఉరుగ్వే సొంతం. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు కేవలం రెండు గోల్సే ఇచ్చింది. ఉరుగ్వే ప్రదాన బలం ఫోర్లానే. ప్రపంచ అత్యుత్తమ స్త్ట్రెకర్లలో తానూ ఒకడినని అతడు ఇప్పటికే నిరూపించుకున్నాడు.
ఉరుగ్వే మైనస్
సా్టర్ ఆటగాడు సురెజ్ దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బ. ఘనాతో మ్యాచ్‌లో బంతిని చేత్తో అడ్డుకుని సురెజ్ రెడ్‌కార్డుకు గురైన సంగతి తెలిసిందే. డిఫెండర్ జోర్గే ఫుసైల్ కూడా సస్పెన్షన్‌లో ఉన్నాడు.
నెదర్లాండ్ ఆశలు స్నైడర్, రాబెన్ పైనే
నెదర్లాండ్స్‌కు స్నైడర్ అత్యంత కీలక ఆటగాడు. బ్రెజిల్‌తో మ్యాచ్‌లో జట్టును గెలిపించింది ఇతడే. సెమీస్‌లో అతడు మరోసారి అలాంటి ప్రదర్శనే చేస్తాడని డచ్ జట్టు ఆశిస్తోంది. అద్భుత ఫామ్‌లో ఉన్న ఈ మిడ్ ఫీల్డర్ ఇప్పటికే నాలుగు గోల్స్ కొట్టాడు. గోల్డెన్ బూట్ రేసులో ఉన్నాడు. రాబెన్ కూడా జోరు మీదున్నాడు. జట్టులో అతడే ప్రధాన స్త్ట్రెకర్. చురుకైన కదలికలతో ప్రత్యర్థి డిఫెన్స్‌ను చిత్తు చేస్తాడు. కీలకమైన సమయంలో గోల్స్ కొట్టి ఇప్పటికే ప్రత్యర్థులకు పీడకలలను మిగిల్చాడు. స్నైడర్‌తో ఇతని జోడీ ప్రత్యర్థులకు హడలే.
ఉరుగ్వే స్టార్స్ డిగో ఫోర్లాన్, మస్లెరా
ఉరుగ్వేలో ఫోర్లాన్‌పై భారీ ఆశలే ఉన్నాయి. ఇతడు ఒంటి చేత్తో జట్టును గెలిపించగలడు. టోర్నీలో ఇప్పటికే మూడు గోల్స్ కొట్టాడు. ప్రి క్వార్టర్స్‌లో ఫ్రీ కిక్‌ను అద్భుతంగా గోల్ గా మలిచి ఉరుగ్వేను గెలిపించిన ఈ స్టార్ మరోసారి మెరిపిస్తాడన్నది ఆ జట్టు అభిమానుల ఆశ. మరో సూపర్ స్త్ట్రెకర్ లూయిస్ సురెజ్ సెమీస్ కు దూరమైన నేపథ్యంలో ఫోర్లాన్‌పై బాధ్యత పెరిగింది. క్వార్టర్స్‌లో గోడలా నిలిచిన గోల్‌కీపర్ మస్లెరా కూడా జట్టుకెంతో బలం. ఇతడు మరోసారి అద్భుతంగా రాణిస్తే ఉరుగ్వే సంచలనం సృష్టించగలదు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications