కొత్త కోచ్: మెరుగైన ప్రదర్శనపై డిఎస్‌కె శివాజీయన్స్ ఆశలు
న్యూఢిల్లీ: గతేడాది ఐ లీగ్ ఎడిషన్ లో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైన పుణె క్లబ్ 'డిఎస్‌కె శివాజీయన్స్' ఈ దఫా అయినా మెరుగైన ఆటతీరు ప్రదర్శించాలని ఆశ పడుతున్నది. ప్రస్తుత సీజన్‌లో మెరుగైన ఆట కోసం తీవ్రస్థాయిలో కసరత్తే చేస్తున్నది. దీనికి కొత్త కోచ్ సారథ్యంలో శిక్షణ అందుతున్నది.
2015-16లో జరిగిన ఐ-లీగ్ టోర్నీలో నేరుగా రంగ ప్రవేశం చేసిన కార్పొరేట్ లీగ్ క్లబ్‌ల్లో ఒకటిగా డిఎస్‌కె శివాజీయన్ క్లబ్ వరుసగా మూడేళ్ల పాటు నిషేధానికి దూరంగా ఉన్నది. డిఎస్ కె గ్రూపు సంస్థకు చెందిన డిఎస్కె శివాజియన్ జట్టు.. గతేడాది తొమ్మిదో స్థానంలో స్థిరపడింది. అంతర్జాతీయంగా లివర్ పూల్ జట్టుతో అనుబంధం ఏర్పరుచుకున్న జట్టుగానూ నిలిచింది. 2014 నుంచి డిఎస్ కె గ్రూప్ ఐ లీగ్ లో భాగస్వామిగా ఉంటున్నది.

డేవ్ రోజర్స్‌ను కోచ్‌గా
గతేడాది లివర్ పూల్ ఇంటర్నేషనల్ అకాడమీ - డిఎస్ కె శివాజీయన్ డేవ్ రోజర్స్‌ను కోచ్‌గా నియమించుకున్నది. ఈ నెల ఏడో తేదీ నుంచి పలు మార్పులు చేయడంతోపాటు సపోర్టింగ్ గా నిలిచింది. అత్యంత ఇంటెన్సిటీ ప్రదర్శించే దిశగా ఈ నెల ఏడో తేదీ నుంచి మొదలయ్యే ఐ-లీగ్ టోర్నీ కోసం విస్త్రుతస్థాయిలో శిక్షణ పొందింది.

మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తుంది
ప్రస్తుత సెటప్‌తో ఈ దఫా టోర్నీలో తమ జట్టు మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తుందని డిఎస్ కె శివాజీయన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీల్ షా ఆశాభావం వ్యక్తంచేశాడు. గతేడాది అత్యధికంగా నేర్చుకునేందుకు తమ సంస్థకు అవకాశం చిక్కిందని, 29 ఏళ్ల చరిత్ర గల ఇండియన్ ఫుట్‌బాల్ క్లబ్ చరిత్రలో అత్యున్నత స్థాయిలో ఆడేందుకు వెసులుబాటు కలిగిందని నీల్ షా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

గత టోర్నీ తర్వాత పూర్తి స్థాయిలో ప్రక్షాళన
గతేడాది టోర్నీ ముగిసిన తర్వాత తమ జట్టును పూర్తిగా ప్రక్షాళన చేశామన్నాడు. అందులో భాగంగా జట్టును బలోపేతంచేసేందుకు యూరప్ ఖండానికి చెందిన డేవ్ రోజర్స్ అనే మేనేజర్‌ను నియమించుకున్నామన్నాడు. తాము పూర్తిస్థాయిలో ఐ లీగ్ టోర్నీ కోసం సిద్ధమయ్యామని తెలిపాడు.

డ్యూరాండ్ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన
గతేడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన డ్యూరాండ్ కప్‌లో సమర్థవంతమైన పెర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తూ వరుసగా డిఎస్ కె శివాజీయన్స్ క్లబ్ మూడో ఏడాది టోర్నీ గెలుచుకున్నదని సిఇఒ నీల్ షా చెప్పాడు. జట్టు కోచ్ గా రోజర్స్ నియామకం చాలా తేలికైందని చెప్పాడు. 41 ఏళ్ల రోజర్స్‌కు ఐర్లాండ్ ప్రీమియర్ లీగ్ టోర్నీ టైటిల్ ను నాలుగేళ్లలో మూడుసార్లు గెలుచుకున్న అనుభవం ఉంది. 1987లో స్థాపించబడిన డిఎస్‌కె జట్టు పలు రకాలుగా అనుభవం సంపాదించింది.

ప్లేయర్ డెవలప్ మెంట్ కేంద్రం ఏర్పాటు
సొంతగడ్డపై ప్లేయర్లను పెంపొందించడమే తమ విధానమని సిఇఓ నీల్ షా తెలిపాడు. ఆరేళ్ల వయస్సు నుంచే ఫుట్ బాల్ పట్ల ఆసక్తి గల వారికి శిక్షణ ప్రారంభిస్తామన్నాడు. తమ యు - 16, యు - 18 జట్లలో ప్లేయర్ల ఎంపికకు ఆరేండ్ల నుంచి 14 ఏళ్లలోపు కుర్రాళ్లకు ప్లేయర్ డెవలప్ మెంట్ కేంద్రం ఏర్పాటు చేశామన్నాడు. ఇతర భారత ఫుట్ బాల్ ఇన్వెస్టర్లకు తమ క్లబ్ ఆదర్శంగా నిలువాలన్నదే తమ అభిమతం అని చెప్పాడు. ఐ - లీగ్ టోర్నీ బలోపేతానికి మార్కెటింగ్ తోపాటు ప్రచారం కూడా కావాలన్నాడు.

ఎఎఫ్ సి లైసెన్సింగ్ సంపాదించడం సంతోషం
2007లో ఐ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆ దిశగా సుదీర్ఘ ప్రయాణం సాగించింది. ఎఎఫ్ సి లైసెన్సింగ్ సంపాదించడం సంతోషంగా ఉందన్నాడు. ఐజ్వాల్ ఎఫ్ సి అద్భుతమైందని, ఈస్ట్ బెంగాల్, మొహున్ బగన్ జట్లకు భారీ స్థాయిలో అభిమానుల మద్దతు ఉందన్నాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)ను భారత్ ఫుట్ బాల్ లో టాప్ లోకి తేవాలన్న ప్రతిపాదన సరైనదేన్నాడు. వచ్చే సీజన్ నుంచే అమలులోకి రానున్నదని తెలిపాడు. అయితే ప్రసారాలు, ప్రచారంతోనే ఫుట్ బాల్ లీగ్ భారత్ లో బలోపేతం అవుతుందన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications