Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెల్జియం గోల్స్ చేస్తే.. టీవీలు ఫ్రీ..ఫ్రీ.. ఫ్రీ

Dries Mertens wants Belgium to score World Cup goals to get his friends free TVs

హైదరాబాద్: మెగా టోర్నీల్లో వచ్చే బంపర్ ఆఫర్ ప్రకటనలలాగే ఫిఫా ప్రపంచకప్‌‌కు కూడా ఓ భారీ ఆఫర్ వచ్చింది. ఏ బారో.. శీతల పానీయాల కంపెనీనో కాదు. ఇంట్లో అలకంరణలు వాడే టీవీలను ఉచితంగా ఇచ్చేస్తామని ప్రకటన జారీ చేసింది ఓ ప్రముఖ టీవీల ఉత్పత్తి సంస్థ. బెల్జియం వాసుల కోసం క్రెఫెల్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ వారు సరికొత్త ఆఫర్‌ను వెల్లడించింది. ఫిపా ప్రపంచకప్‌లో బెల్జియం జట్టు 16, అంతకంటే ఎక్కువ గోల్స్‌ సాధిస్తే టీవీలు ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

రష్యా వేదికగా ఫిఫా ప్రపంచకప్‌ పోటీలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిఫా ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందే క్రెఫెల్‌ సంస్థ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. 'ఈ మెగా టోర్నీలో బెల్జియం జట్టు ఒకవేళ 16, అంతకంటే ఎక్కువ గోల్స్‌ సాధిస్తే.. మా వద్ద టీవీలు కొనుగోలు చేసిన వారికి తిరిగి వారి డబ్బు వారికి పూర్తిగా ఇచ్చేస్తాం. అంటే వారు ఉచితంగా టీవీలు కొనుకున్నట్లే. దీనికి ఉన్న ఒకే ఒక్క నిబంధన ఏంటంటే... యాజమాన్యం నిర్ణయించిన కాల పరిమితిలో టీవీలు కొన్నవారికి ఇది వర్తిస్తుంది' అని తెలిపారు.

తాజాగా దీనిపై బెల్జియం ఆటగాడు డ్రైస్‌ మెర్టిన్స్‌ మాట్లాడుతూ... 'నా స్నేహితులు చాలా మంది ఈ మధ్య కాలంలో టీవీలు కొనుక్కున్నారు. ఇప్పుడు అంతా వారి గురించే ఆలోచిస్తున్నాను. లుకాకు, ఈడెన్‌ హజర్ట్‌ లాంటి ఆటగాళ్లతో బెల్జియ్ం ప్రస్తుతం బలంగా ఉంది. మేమంతా కలిసి మరిన్ని గోల్స్‌ సాధించాలనుకుంటున్నాం' అని సరదాగా వ్యాఖ్యానించాడు మెర్టిన్స్‌.

కాగా, గ్రూపు దశ దాటేసిన బెల్జియం ఇప్పటి వరకు బెల్జియం 9 గోల్స్‌ చేసింది. నాకౌట్‌ దశలో సోమవారం జపాన్‌ జట్టుతో తలపడనుంది. ఈ ప్రపంచ కప్‌లోనే మరో ఏడు గోల్స్ చేయగలిగితే బెల్జియం వాసులకు బంపర్ దొరికనట్లే.

Story first published: Monday, July 2, 2018, 20:45 [IST]
Other articles published on Jul 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+