
హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్‌లో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ లెజెండ్, టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను నియమించింది. ఐఎస్ఎల్‌లో తొలిసారిగా అరంగేట్రం చేస్తున్న బెంగళూరు ఎఫ్‌సి రాబోయే సీజన్‌కు గాను ద్రవిడ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది.
టోర్నీలో భాగంగా నవంబర్ 19న బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ముంబై సిటీ ఎఫ్‌సి జట్టుతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ ఎఫ్‌సి ప్రచారకర్తగా ఎంపికవడం థ్రిల్లింగ్‌గా ఉందని, గత నాలుగేళ్లుగా బెంగళూరు ఎఫ్‌సి మెరుగ్గా రాణిస్తోందని తెలిపారు.
ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్న జట్లలో బెంగళూరు ఎఫ్‌సి ఒకటని, అటువంటి జట్టు ప్రతినిధిగా ఎంపికవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో బెంగళూరు ఎఫ్‌సి తనదైన ముద్ర వేస్తోందని, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నదని ద్రవిడ్ అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం మై-ఖేల్ తెలుగును ఫేస్‌బుక్, ట్విటర్‌లో , గూగుల్ ప్లస్ ఫాలో అవ్వండి.