Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండుపై ఆడుతానో, లేదో: మైకేల్ క్లార్క్ నిర్వేదం

అడిలేడ్: తమ జట్టు ఆడే ప్రపంచ కప్ మొదటి మ్యాచులో ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఆడడం అనుమానంగానే ఉంది. అతను గాయంతో బాధపడుతున్న కారణంగా ఆ మ్యాచుకు దూరమయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 14వ తేదీన ఆస్ట్రేలియా తన తొలి మ్యాచులో ఇంగ్లాండును ఎదుర్కోనుంది.

ఇంగ్లాండుపై ఓపెనింగ్ మ్యాచులో ఆడుతారా అని మీడియా ప్రతినిధులు అడిగితే, ఆ ప్రశ్నను వైద్య సిబ్బందికి వేయాలని, దానికి సమాధానం తన వద్ద లేదని మైకేల్ క్లార్క్ అన్నాడు. మొదటి నుంచీ తాను మార్గదర్శక సూత్రాలను పాటిస్తున్నానని, ఈ స్థితిలో తాను కూర్చోవాల్సి వచ్చినందుకు కృతజ్ఞతతో ఉన్నానని, అది సలహా, సూచన మేరకే జరిగిందని ఆయన అన్నారు. వంద శాతం తనను ఆదేశించాల్సింది వారేనని ఆయన అన్నారు.

Don't know if I would be playing World Cup opener vs England, says Michael Clarke

అడిలేడ్ టెస్టు మ్యాచు నుంచి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, అతను ప్రపంచ కప్ పోటీల్లో ఎక్కువ మ్యాచులకు దూరంగా ఉండకపోవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆరు నెలలుగా తాను ఎంతో క్రికెట్ మిస్సయ్యానని, ఒక్కసారి తాను వచ్చిన తర్వాత ప్రతి మ్యాచూ ఆడుతానని, అయితే తాను మ్యాచులు ఆడడం ప్రారంభించడమనేది వారి మీద ఆధారపడి ఉంటుందని అన్నారు.

బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో క్లార్క్ 34 పరుగులు చేశాడు, రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. అయితే, పూర్తి స్థాయి వన్డే ఆడడానికి ఇంకా సమయం పడుతుందని అతను భావిస్తున్నాడు. తాను మైదానంలోకి దిగిన తర్వాత వెనక్కి చూడబోనని అన్నారు. వంద శాతం ప్రతిభ కనబరుస్తానని చెప్పాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+