ISL 2019-20 ప్రారంభోత్సవంలో అదరగొట్టనున్న టైగర్ ష్రాఫ్, దిశా పటానీ

హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఆరో సీజన్ ఆరంభ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టోర్నీ నిర్వహాకులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ ఆరంభ వేడుకల్లో బాలీవుడ్ తారలు తుళుక్కుమననున్నారు. ఐఎస్ఎల్ 2019-20 ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోని విడుదల చేశారు.
ఈ వీడియోలో దిషా పటానీ, టైగర్ ష్రాఫ్ కొచ్చిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఉంటామని, మ్యాచ్‌కు ముందు ప్రదర్శన ఇవ్వడంతో పాటు ఆటను చూస్తామని తెలిపాడు. అనంతరం వీడియోలో దిషా పటానీ.. టైగర్ ష్రాఫ్‌ను ఆరోజు రాత్రి ఏ జట్టుకు సహకరిస్తానని అడుగుతుంది.
అందుకు అతడు "అబ్ టైగర్ తోహ్ బెంగాల్ కి సైడ్ హాయ్ హోగా నా" (టైగర్ బెంగాల్‌తో మాత్రమే ఉంటుంది) అని సమాధానమిస్తాడు. ఆదివారం కొచ్చిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరగబోయే ఈ ఆరంభ వేడుకలకు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటానీ ప్రత్యేకంగా ప్రదర్శన ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమానికి నటుడు దుల్కర్ సల్మాన్ యాంకర్‌గా వ్యవహరించనుండడం మరో విశేషం. దీంతో పాటు ఇటీవలే వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ పోటీల్లో విజేతగా నిలిచిన కింగ్స్ యునైటెడ్ బృందం ఫుట్‌బాల్ థీమ్‌తో చేసే నృత్యం ప్రత్యేకంగా నిలువనుంది. టోర్నీలో భాగంగా ఆరంభ మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కతా, కేరళ బ్లాస్టర్స్ తలపడనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications