Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అఫీసియల్: ఫిఫా బ్రాండ్ అంబాసిడర్‌గా డిగో మారడోనా

హైదరాబాద్: ఫిఫాతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పుట్‌బాల్ లెజెండ్ డీగో మారడోనా ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించాడు. పుట్‌బాల్‌కు మారడోనా చేసిన సేవలను గుర్తించిన ఫిఫా అతడిని అంబాసిడర్‌గా నియమించుకుంది.

ఈ విషయాన్ని మారడోనా తన ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించాడు. 'చివరికి నా జీవితకాల కలను నెరవేర్చుకోగలిగాను. ఫిఫాతో కలిసి పారదర్శకంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా' అని డిగో మారడోనా తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.

ఫిఫా అత్యున్నత గౌరవానికి ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో మరడోనాని ఆహ్వానించాడు. ఈ సందర్భంగా మారడోనా మాట్లాడుతూ అర్జెంటీనా పుట్‌బాల్ అసోసియేషన్‌ను అభివృద్ధికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.

1986 ఫిఫా ప్రపంచకప్‌ విజేతగా అర్జెంటీనా అవతరించడానికి మారడోనానే కారణం. దాంతో అర్జెంటీనా అభిమానులకు మారడోనా ఆరాధ్యదైవమయ్యాడు. పుట్‌బాల్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్‌ బాల్‌ అవార్డును కూడా అందుకున్నాడు.

2008 నుంచి 2010 వరకు అర్జెంటీనా జాతీయ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. మారడోనా ఆధ్వర్యంలోనే అర్జెంటీనా జట్టు 2010 ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ వరకు వెళ్లింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+