For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అర్జెంటీనాదే కప్పు: 'ఆ భావోద్వేగ క్షణాలను మెస్సీ ఆస్వాదించాలి'

By Nageshwara Rao
Diego Maradona Exclusive: Want Messi to experience winning the World Cup

హైదరాబాద్: రష్యా వేదికగా గురువారం ప్రారంభమైన 21వ ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా జట్టు ఈసారి తప్పకుండా వరల్డ్‌కప్‌ గెలుస్తుందని ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనా అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ జాతీయ మీడియా పత్రికకు రాసిన వ్యాసంలో మారడోనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టైటిల్ ఫేవరేట్లలో అర్జెంటీనా ఒకటి

టైటిల్ ఫేవరేట్లలో అర్జెంటీనా ఒకటి

ప్రస్తుతం రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో టైటిల్ ఫేవరేట్లలో అర్జెంటీనా జట్టు కూడా ఒకటి. 2014లో బ్రెజిల్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో జర్మనీ చేతిలో అర్జెంటీనా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన 2015, 2016 కోపా అమెరికా టోర్నీ ఫైనల్స్‌లోనూ అర్జెంటీనా ఓడిపోయింది.

అర్జెంటీనాను మెస్సీ విజేతగా నిలుపుతాడు

అర్జెంటీనాను మెస్సీ విజేతగా నిలుపుతాడు

అయితే, వాటికి సంబంధం లేకుండా ఈ ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనాను మెస్సీ విజేతగా నిలుపుతాడని చెప్పాడు. తద్వారా 32 ఏళ్ల వరల్డ్ కప్ నిరీక్షణకు మెస్సీ ఈసారి ముగింపు పలుకుతాడని మారడోనా ధీమా వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మారడోనా మాట్లాడుతూ "ఈ సారి అర్జెంటీనా కప్‌ గెలుస్తుంది" అని చెప్పాడు.

నేనేమీ అంచనాలు వేయడం లేదు

నేనేమీ అంచనాలు వేయడం లేదు

"ఇది చెప్పడానికి నేనేమీ అంచనాలు వేయడం లేదు. మెస్సీ వరల్డ్‌కప్‌ గెలిచి తన గొప్పతనాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ఈసారి మాత్రం మెస్సీ వరల్డ్ కప్‌ గెలవాలని బలంగా కోరుకుంటున్నాడు. అదే అర్జెంటీనా జట్టుకు ప్రధాన బలం. క్షణాల్లో మ్యాచ్‌ దిశను మలుపు తిప్పగల సత్తా అతనిలో ఉంది" అని అన్నాడు.

ఆ భావోద్వేగ క్షణాల గురించి వర్ణించడం చాలా కష్టం

ఆ భావోద్వేగ క్షణాల గురించి వర్ణించడం చాలా కష్టం

"ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత అప్పటి భావోద్వేగ క్షణాల గురించి వర్ణించడం చాలా కష్టం. వాటిని మెస్సీ కూడా తప్పకుండా అనుభవించాలని కోరుకుంటున్నా" అని మారడోనా ఈ వ్యాసంలో రాసుకొచ్చాడు. టోర్నీలో భాగంగా గ్రూపు-డిలో ఉన్న అర్జెంటీనా శనివారం తొలి మ్యాచ్‌లో ఐస్‌లాండ్‌తో తలపడనుంది.

Story first published: Saturday, June 16, 2018, 14:42 [IST]
Other articles published on Jun 16, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+