గౌహతి: ఫుట్‌బాల్ పట్ల భారత్ ఆటగాళ్లలో స్ఫూర్తి ఆకట్టుకునే విధంగా, మనోహరంగానే ఉన్నదని ఐఎస్‌ఎల్ కేరళ బ్లాక్‌బస్టర్స్ మార్క్యూస్ ప్లేయర్ (సారధి) ఆరోన్ హుగెస్ పేర్కొన్నారు. తమ జట్టు సెటప్ ఇంప్రెస్సివ్‌గానే ఉందని వ్యాఖ్యానించారు.
శనివారం నార్త్‌ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి క్లబ్‌తో ముచ్చటగా మూడో ఏటా ఐఎస్‌ఎల్ ప్రారంభ మ్యాచ్‌లో తలపడనున్న నేపథ్యంలో హుగెన్ మీడియాతో మాట్లాడారు.
'ప్రతి ఆటగాడు ఆయన మార్గంలో ఎంతో ప్రతిభావంతుడు. వారిలో నైతిక ప్రమాణాలు చాలా బాగున్నాయి. కేవలం పిచ్‌పై ఇష్టాగోష్ఠి చర్చల్లోనూ ఆట గురించే మాట్లాడతారు. నన్ను ప్రతి క్రీడాకారుడు ఆకట్టుకున్నాడు. ఒక్కొక్క ఆటగాడి వ్యక్తిగత ఆట తీరు గురించి నేను మాట్లాడటం సబబు కాదు. నేనెక్కడున్నా వారు నిజంగా శుభ ఆరంభాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు' అని చెప్పారు.

తనకు ఐఎస్‌ఎల్‌లో చేరేవరకు భారత్‌లో ఫుట్‌బాల్ పరిస్థితులు తెలియవని అంగీకరించాడు. గత ఏడాది తనకు తెలిసిన కొందరు కుర్రాళ్లు మాత్రమే ఆడతారని అనుకున్నానని, కానీ టీవీలో మ్యాచ్‌ను గమనిస్తున్నప్పుడు మాత్రమే వారిలో ఉన్న పట్టుదల, సామర్థ్యం అర్థమయ్యాయన్నాడు.
జట్టులోని సభ్యులంతా వివిధ టీంల నుంచి వచ్చిన వారమైనా ఉమ్మడిగా ఆడుతున్నామన్నారు. ప్రతి గేమ్‌కు హోంవర్క్ తప్పనిసరని స్పష్టంచేశారు. ప్రత్యర్థి జట్టు నుంచి నాలెడ్జ్ పొందడానికి ప్రయత్నిస్తానన్నారు.
టోర్నీ ప్రారంభానికి ముందు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు తమ జట్టు సభ్యులపై ప్రభావం చూపవన్నాడు. తమ దృష్టంతా మ్యాచ్‌పైనే ఉంటుందని తెలిపాడు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నంత సేపు అందరి దృష్టి వాటిపైనేనన్నారు. ఒకసారి అందరూ పిచ్‌పైకి వచ్చాక మొత్తం పరిస్థితులు మారిపోతాయని తెలిపారు.
భారతీయుల్లో అభ్యాసానికి కుతూహలం ఎక్కువే
భారతీయులు ఫుట్‌బాల్ నేర్చుకోవడానికి ఎక్కువ కుతూహలం చూపుతున్నారని అరోన్ హెగోస్ వ్యాఖ్యానించాడు. ముందడుగు వేయాలని ఆకాంక్షించే ప్రతి జట్టుకు ఆటగాళ్ల స్పందన చాలా ముఖ్యమన్నాడు. దేశంలో ఫుట్‌బాల్ ఆట మెరుగుదలకు ఆలోచించే ఆటగాళ్లు ఉండటం జట్టుకు చాలా మంచిదని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
లీగ్ టైటిల్‌ను గెలుచుకోవాలని తనకు ఆకాంక్ష ఉన్నదని ఇదే అభిప్రాయంతో మిగతా ఆటగాళ్లు కూడా ఆడాలని వ్యాఖ్యానించాడు. అందుకే లీగ్‌లో పాల్గొనాలని ఆసక్తి ప్రదర్శించినట్లు చెప్పాడు. కేరళ బ్లాక్ బస్టర్ సారధిగా తనకిది కొత్త అనుభవం, కొత్త సవాల్ అని అన్నాడు.