ఫాటోర్డా: ఢిల్లీ డైనమోస్‌తో జరిగిన మ్యాచ్‌లో తాము కొన్నిపొరపాట్లు చేశామని ఎఫ్ సి గోవా స్టార్ ఆటగాడు మందార్‌రావు దేశాయ్ అంగీకరించాడు. గత ఏడు మ్యాచ్ ల్లో కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలుపొంది నాలుగు పాయింట్లతో అట్టడుగు స్థానాన్ని ఆక్రమించిన గోవా ప్లేయర్ దేశాయ్ తాము మంచి గేమ్ కోల్పోయామన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిఫస్ట్ఆఫ్‌లో గోల్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నామన్నాడు. తొలి హాఫ్ లో తాము గోల్ పొందాల్సి ఉన్నా అది కుదరలేదన్నాడు. ప్రారంభం నుంచి ఆధిపత్యం కొనసాగించినా తమ పొరపాటు వల్లే గోల్ చేయలేకపోయామని తెలిపాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ తమకు చాలా కీలకమని, తప్పనిసరిగా గెలుపొందాల్సిన అవసరం ఉందన్నారు. గెలుపొందితే తమ పాయింట్లు ఏడుకు చేరుకునేవని చెప్పారు. ప్రారంభంలో గోల్ చేసే అవకాశం కోల్పోయినా మళ్లీ మళ్లీ గోల్ చేస్తూనే ఉన్నానన్నాడు.
మార్సెలిన్హో చాలా కీలకం: జంబ్రొట్టా
ఎఫ్ సి గోవాపై విజయం తర్వాత ఢిల్లీ డైనమోస్ హెడ్ కోచ్ జియాంలుకా జంబ్రొట్టా సంతోషంగా ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లలో రెండో విజయం ఇది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్బంగా జంబ్రొట్టా మీడియాతో మాట్లాడుతూ 'మార్సిలిన్హో తమ జట్టుకు చాలా ముఖ్యమైన వాడు. ఆయన చాలా బాగా ఆడతాడు. గాయం నుంచి కోలుకోగానే మ్యాచ్ సెకండాఫ్‌లో రంగంలోకి దించాం. బాదరా బాద్జీ, కీన్ లూయిస్ కూడా బాగానే ఆడతారు' అని చెప్పాడు.
ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జంబ్రొట్టా స్పందిస్తూ తమ జట్టు మ్యాచ్ ఫలితం డ్రాగా ముగించడం వల్ల తనకు ఇబ్బందేమీ లేదన్నాడు. కానీ మిగతా జట్లు బాగా ఆడుతూ ముందుకు దూసుకెళ్తున్నాయని చెప్పాడు. అందువల్లే గోవాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించాలని కుర్రాళ్లకు చెప్పానన్నాడు.

కోచ్ ఆదేశమే శిరోధార్యం: మార్సిలిన్హో
ఆదివారం ఫాటోర్డాలో గోవాతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కుర్రాడు మార్సిలిన్హో రంగ ప్రవేశంతో మొత్తం తీరే మారిపోయింది. మ్యాచ్ ప్రారంభమైన గంట తరువాత సెకండాఫ్‌లో పిచ్‌లో అడుగు పెట్టిన మార్సిలిన్హో చెలరేగిపోయాడు. 72వ నిమిషంలో సొంతంగా గోల్ చేయడంతోపాటు మరో నాలుగు నిమిసాలకు రిచర్డ్ గాడ్జె గోల్ లోనూ సహకరించి జట్టుకు 2 - 0 ఆధిక్యం తెచ్చి పెట్టాడు.
తొలుత బెంచికి పరిమితమైన తనకు కోచ్ జంబ్రొట్టా ఆదేశాలే శిరోధార్యమన్నాడు. ఆయన సూచనకు అనుగుణంగానే మ్యాచ్ ఫినిష్ చేశానన్నాడు. తమ సహచర ఆటగాళ్లంతా అలసిపోయారని, తాను ఫ్రెష్‌గా బరిలోకి దిగడంతో విజయం సాధించానని మార్సిలిన్హో చెప్పాడు. ఐఎస్ఎల్ టోర్నీలో 50వ గోల్ చేసినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఈ మ్యాచ్ లో తాము పొందిన మూడు పాయింట్లు చాలా ముఖ్యమైనవని, తదుపరి మ్యాచ్ లోనూ మరో మూడు పాయింట్లు పొందగలమని ఆశాభావం వ్యక్తంచేశాడు.
మార్లోన్‌తో శాశ్వత బంధంపై బార్సిలోనా కన్ను
రియో డీ జెనెరో: కాటలాన్ ఫుట్ బాల్ జెయింట్స్ బార్సిలోనా తమ సెంటర్ బాక్ ప్లేయర్ మార్లోన్ తో శాశ్వత బంధం కుదుర్చుకునే అంశంపై ద్రుష్టి పెట్టింది. ఆరు నెలలుగా బార్సిలోనా బీ క్లబ్ లో ఆడుతున్న మార్లోన్ ఆటతీరు ఫ్రాంచైసీ యాజమాన్యాన్నిఆకట్టుకున్నది. గాయాలతో బాధపడుతున్నా కాటలాన్ క్లబ్ హెడ్ కోచ్ లూయిస్ ఎన్రిక్యు.. మార్లోన్ తో సంప్రదింపులు జరిపాడు. తమ ఫస్ట్ టీంలో చేర్చుకోవాలని తమకు ఆసక్తి ఉన్నదని పేర్కొన్నాడు.
శనివారం లా లీగా మ్యాచ్ లో గ్రనడపై బార్సిలోనా 1 - 0 స్కోర్ తో విజయం సాధించడంలో మార్లోన్ కీలక పాత్ర పోషించడంతో జట్టు ఫ్రాంచైసీ ద్రుష్టి ఆయనపైకి మళ్లింది. దీంతో త్వరలో చాంపియన్స్ లీగ్ లో పాల్గొనేందుకు మాంఛెస్టర్ సిటీకి వచ్చే బ్లౌగ్రాన స్క్వాడ్ లో మార్లోన్ పేరు చేరుతుందని భావిస్తున్నారు. పర్మినెంట్ డీల్ కోసం మార్లోన్ తో బార్సిలోనా ఫ్రాంచైసీ 2.19 మిలియన్ డాలర్ల మేరకు కాంట్రాక్ట్ కుదుర్చుకోవాల్సి ఉంటుంది.