For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

జర్మనీపై ఓడినా 4 పాయింట్లతో ఘనా నాకౌట్ కు

By Santaram
Philipp Lahm
జొహానెస్‌ బర్గ్‌: అదృష్టం ఘనానే వరించింది. జర్మనీ చేతిలో ఓడినా ఘనా నాకౌట్లో అడుగుపెట్టింది. ఒక విజయం, ఒక డ్రా, ఒక ఓటమితో 4 పాయింట్లు సాధించిన ఘనా గోల్స్‌ తేడా (0)లో ఆస్ట్రేలియా (-3)ను వెనక్కి నెట్టి రెండో రౌండుకు అర్హత సాధించింది. ఈ గ్రూప్‌లో ఓ మ్యాచ్‌ ఓడి రెండు విజయాలు సాధించిన జర్మనీ 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్‌కు దూసుకెళ్లింది. బుధవారం రాత్రి జర్మనీ 1-0తో ఘనాను ఓడించింది. 60వ నిమిషంలో ఓజిల్‌ అద్భుతమైన గోల్‌ కొట్టి జర్మనీకి ఆధిక్యాన్నందించాడు.

గెలిచినా ఆస్ట్రేలియా ఇంటికి...: గ్రూప్‌-డి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2-1తో సెర్బియాను ఓడించింది. 69వ నిమిషంలో కాహిల్‌ ఆ జట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు. హోల్మన్‌ (73వ) అద్భుత రీతిలో గోల్‌ చేసి ఆసీస్‌ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. పాంటలిచ్‌ (84వ) గోల్‌తో సెర్బియా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ఆస్ట్రేలియా 4 పాయింట్లతో ఘనాతో సమంగా నిలిచినా గోల్‌ తేడాలో వెనుకబడి మూడో స్థానానికి పరిమితమైంది.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+