Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐ లీగ్: టైటిల్ కల సాకారమే ఈస్ట్ బెంగాల్ లక్ష్యం

కోల్‌కతా: దీర్ఘకాలంగా ఐ లీగ్ టైటిల్ కోసం అన్వేషణ సాగిస్తున్న ఈస్ట్ బెంగాల్ జట్టు మరోమారు తన కల సాకారంచేసుకునే దిశగా అడుగులు వేస్తున్నది. శనివారం బరాసత్ స్టేడియంలో ఐజ్వాల్ ఎఫ్‌సి జట్టుతో తలపడుతుంది. ఈస్ట్ బెంగాల్ జట్టు తన ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఇవాన్ బుకెన్యా (డిపెండర్), విల్లీస్ ప్లాజా (ఫార్వర్డ్ ప్లేయర్) లేకుండానే బరిలోకి దిగుతున్నది.

ఈ కోల్‌కతా సిటీ జెయింట్స్ జట్టు 2004 నుంచి ఐ లీగ్ టైటిల్‌ను గెలుచుకోలేదు. ఒక విదేశీ ఆటగాడు హైతియన్ ప్లేయర్ వెడ్సన్ అంసెల్మెతోనే తన టోర్నీప్రారంభిస్తున్నది. 'వారు (బుకెన్యా, ప్లాజా) వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారి నుంచి అంచనా వేయడం అంత తేలిక కాదు' అని ఈస్ట్ బెంగాల్ కోచ్ ట్రెవొర్ జేమ్స్ మోర్గాన్ మీడియాకు చెప్పాడు.

గాయం కారణంగా మ్యాచ్‌లకు దూరమైన అర్నాబ్ మొండాల్‌

గాయం కారణంగా మ్యాచ్‌లకు దూరమైన అర్నాబ్ మొండాల్‌

ట్రైనింగ్‌కు సమయం లేకపోవడంతో బుకెన్యా, ప్లాజాలు తొలి మ్యాచ్‌లో పాల్గొంటారన్నాడు. ఆసియా కోటాలో నాలుగో విదేశీ ఆటగాడితో ఈస్ట్ బెంగాల్ ఇంకా కాంట్రాక్ట్ కుదుర్చుకోలేదు. సెంటర్ బ్యాక్ ప్లేయర్ అర్నాబ్ మొండాల్ తీవ్ర గాయంతో కొద్ది మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. మిడ్ ఫీల్డర్ కెవిన్ లోబో కూడా శనివారం మ్యాచ్‌లో పాల్గొనడం అనుమానమే.

2011, 2012ల్లో టైటిల్ రన్నరప్‌గా ఈస్ట్ బెంగాల్

2011, 2012ల్లో టైటిల్ రన్నరప్‌గా ఈస్ట్ బెంగాల్

మోర్గాన్ శిక్షణలో 2011, 2012ల్లో ఐ లీగ్ టైటిల్ రన్నరప్‌గా నిలిచింది. ఈ దఫా టైటిల్ గెలుచుకునేందుకు తన శక్తియుక్తులను బ్రిటన్ కోచ్ మోర్గాన్ వినియోగించనున్నాడు. ‘ఆ రెండు సీజన్లలో టైటిల్ గెలుచుకోలేకపోవడం మా దురద్రుష్టకరం. మా అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయని నాకు తెలుసు' అని మోర్గాన్ వ్యాఖ్యానించాడు.

లక్ష్యం టైటిల్: సర్వశక్తులు ఉపయోగిస్తాం

లక్ష్యం టైటిల్: సర్వశక్తులు ఉపయోగిస్తాం

ఈ దఫా టైటిల్ గెలుచుకునేందుకు సర్వశక్తులు ఉపయోగిస్తామని అన్నాడు. ఐ లీగ్‌తోపాటు ప్రతి మ్యాచ్‌లోనూ విజయానికి కష్టపడి పనిచేస్తామన్నాడు. మోకాలు, చీల మండల గాయాలతో ఆటగాళ్లు ముందుకు వెళ్లడం అసాధ్యమన్నాడు. లక్ష్య సాధనకు శక్తి సామర్థ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉన్నదన్నాడు.

విదేశీ ఆటగాళ్లు ప్రధాన పాత్ర

విదేశీ ఆటగాళ్లు ప్రధాన పాత్ర

ఐజ్వాల్ జట్టు కోచ్‌గా ఖాలిద్ జమీల్ తన ప్రత్యర్థి జట్ల శక్తి సామర్థ్యాలు తెలిసి అందుకు అనుగుణంగా వ్యూహరచన చేశాడు. లైబేరియన్ స్ట్రయికర్ అల్‌ఫ్రెడ్ జార్యన్ సారథ్యంలో నైజిరియన్ ఎజె కింగ్స్‌లే, ఐవరీ కోస్ట్ కామో బాయి ఇతర విదేశీ ఆటగాళ్లు ప్రధాన పాత్ర పోషించనున్నారు. వీరితోపాటు జయేశ్ రాణె, అశుతోష్ మెహతా కూడా తన శక్తియుక్తులు ప్రదర్శించనున్నారు. తాము డిఫెన్సివ్‌గా ముందుకెళ్లగలమని తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+