Christian Eriksen: గుండెపోటుతోనే మైదానంలో కుప్పకూలాడు!

కోపెన్‌హెగెన్‌: కరోనాతో ఏడాది తర్వాత ఉత్సాహంగా ప్రారంభమైన యూరో కప్‌లో ఆదిలోనే అపశ్రుతి ఏర్పడింది. ఫిన్లాండ్‌తో ఆరంభ మ్యాచ్‌లో డెన్మార్క్‌ స్టార్‌ మిడ్‌ఫీల్డర్‌ క్రిస్టియన్‌ ఎరిక్సన్‌ మైదానంలో కుప్పకూలడంతో యావత్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచం నివ్వెరపోయింది. అయితే క్రిస్టియన్ ఎరిక్సన్‌కు ఏమైందనే విషయం చెప్పకుండా ఆసక్తిని రేకెత్తించారు. చివరకు ఈ డెన్మార్క్‌ మిడ్ ఫీల్డర్‌కు మైదానంలో గుండెపోటు వచ్చిందని డాక్టర్లు ధృవీకరించారు. అయితే ఆసుపత్రిలో అతనికి నిర్వహించిన పరీక్షల్లో అన్ని సాధారణంగానే ఉన్నాయని డెన్మార్క్ టీమ్ డాక్టర్ మోర్టెన్ బోయినెస్ వెల్లడించాడు.

గుండె పోటు..

గుండె పోటు..

‘అతనికి గుండెపోటు వచ్చింది. అవును.. బతకడం అతని అదృష్టం. ఎరిక్సన్ కుప్పకూలిపోయినాక.. దగ్గరికి వెళ్లి చూశాం. అతనికి గుండెపోటు వచ్చిందని అప్పుడే అర్థమైంది. చనిపోయాడనుకున్నాం. కానీ, అదృష్టం కొద్ది బతికాడు. ఆసుపత్రిలో అతనికి నిర్వహించిన పరీక్షల్లో అన్ని నార్మల్‌గా ఉన్నాయి. అయితే ఇది ఎలా జరిగిందనేది మాత్రం చెప్పలేం. ఇంతకంటే విషయాలేమీ ఇప్పుడు వివరించలేను' అని మోర్టెన్‌ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఫిన్లాండ్ 1-0 తేడాతో డెన్మార్క్‌పై విజ‌యం సాధించింది. సెకండాఫ్‌లో ఫిన్లాండ్‌ ప్లేయ‌ర్ జోయెల్ పోజాన్‌పాలో గోల్ చేసి, తమ జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు.

వేటు తప్పదా?

వేటు తప్పదా?

తని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మళ్లీ ఆడతానని ఎరిక్సన్ ముందుకొచ్చినా.. తీసుకునే ప్రసక్తే లేదని ఇటలీ ప్రకటించింది. క్రిస్టియన్‌ డెన్మార్క్‌ జాతీయ జట్టులోనే కాకుండా.. ఇంటర్‌ మిలన్‌(సిరీ ఎ క్లబ్‌) తరపున ఆడుతున్నాడు కూడా. ఈ క్రమంలో అక్కడి చట్టాల ప్రకారం అతనిపై నిషేధం విధించే అవకాశం ఉందని క్లబ్‌ మెంబర్‌ ఒకరు తెలిపారు. ఇక డెన్మార్క్‌ జట్టు కూడా అతని ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. తిరిగి జట్టులోకి చేర్చుకునే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఎరిక్సన్ 2010 మార్చ్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడగా.. 2010 ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఆడిన యంగెస్ట్‌ ప్లేయర్‌ ఘనత దక్కించుకున్నాడు. ఐదేళ్లపాటు డెన్మార్క్‌ ‘ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు' దక్కించుకున్నాడు కూడా.

సిమోన్‌..ద హీరో

సిమోన్‌..ద హీరో

ఇకపోతే.. 42వ నిమిషంలో ఎరిక్సన్‌ మైదానంలో పడిపోయిన వెంటనే డెన్మార్క్‌ కెప్టెన్‌ సిమోన్‌ క్యా తక్షణం స్పందించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎరిక్సన్‌ను కాపాడిన సిమోన్‌ను హీరోగా అభివర్ణిస్తున్నారు. నాయకుడంటే మైదానంలో జట్టును నడిపించడమేకాదు అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎలా స్పందించాలో సిమోన్‌ నిరూపించాడని కూడా కొనియాడుతున్నారు. ఇంతకీ సిమోన్‌ ఏం చేశాడంటే.. ఎరిక్సన్‌ కుప్పకూలిన మరుక్షణమే అతడి వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. ఎరిక్సన్‌ పల్స్‌ను పరిశీలించాడు.

బోర్లాపడి ఉన్న ఎరిక్సన్‌ను

బోర్లాపడి ఉన్న ఎరిక్సన్‌ను

అతడు గాలి పీల్చుకోవడానికి నాలుక అడ్డుపడడంలేదని నిర్ధారించుకున్నాడు. బోర్లాపడి ఉన్న ఎరిక్సన్‌ను తిప్పిపడుకోబెట్టి సీపీఆర్‌ (కార్డియో పల్మొనరీ రిససిటేషన్‌ అంటే..చాతిపై చేయివేసి అదమడం ద్వారా రోగికి ప్రాణవాయువును పునరుద్ధరించడం) నిర్వహించాడు. ఈలోపు వైద్య సిబ్బంది గ్రౌండ్‌లోకి వచ్చి ఎరిక్సన్‌కు అత్యవసర చికిత్స నిర్వహించిన అనంతరం ఆసుపత్రికి తరలించారు. ఊహించని ఘటనతో స్టేడియంలోనే ఉన్న ఎరిక్సన్‌ భార్య సబ్రినా తీవ్ర ఆందోళనకు లోనైంది. దాంతో ఆమె వద్దకు వెళ్లి ఓదార్చడంతోపాటు సిమోన్‌ ధైర్యం చెప్పాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
అంచనాలు
VS
Story first published: Monday, June 14, 2021, 11:47 [IST]
Other articles published on Jun 14, 2021
+ మరిన్ని
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X