Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డెంగ్యూతో 29 ఏళ్ల పుట్‌బాల్ క్రీడాకారిణి మృతి

లక్నో: జాతీయ మహిళా పుట్‌బాల్ క్రీడాకారిణి పూనమ్ చౌహాన్ డెంగ్యూతో మరణించింది. ఈ మేరకు బుధవారం అధికారులు ప్రకటన చేశారు. డెంగ్యూ కారణంగా ఆమె మంగళవారం రాత్రి మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Poonam Chauhan


29 ఏళ్ల పూనమ్ చౌహాన్‌ను అస్వస్థతకు గురి కావడంతో కొన్ని రోజుల క్రితం ఆమెను వారణాసి మక్బూల్ ఆలం రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది.

బుధవారం నగరంలోని మకర్ణికా ఘాట్‌లో ఆమె మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. 2007-10 మధ్య కాలంలో పూనమ్ జాతీయ ఫుట్ బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఉత్తరప్రదేశ్ జట్టు తరఫున జాతీయ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ లో పదిసార్లు ఆడింది.

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో డెంగ్యూ ప్రబలింది. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోనే ఈ డెంగ్యూ కారణంగా 200 మందికిపైగా మరణించారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+