Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్: గోవాతో నేడు ఢిల్లీ ఢీ

న్యూఢిల్లీ: ప్రస్తుత ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మూడో ఎడిషన్ టోర్నీలో స్ఫూర్తిదాయక ఆటతీరు కనబరుస్తున్న ఢిల్లీ డైనమోస్ జట్టు ఈ దఫా టైటిల్ కోసం సమర్థవంతంగా దూసుకు వెళుతున్నది. గత మ్యాచ్‌లో ఓటమి మినహా విజయాలతో ఢిల్లీ లయన్స్ దూసుకెళుతున్నారు. తాజాగా పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న ఎఫ్‌సి గోవాతో ఆదివారం రాత్రి ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో తలపడనున్నది.

మరో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉన్న ఢిల్లీ డైనమోస్ ప్రస్తుత సీజన్‌లోనే స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో ముందుకు దూసుకొస్తున్నది. 11 మ్యాచ్‌ల్లో 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో నిలిచిన ఢిల్లీ డైనమోస్ ఆదివారం జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లేఆఫ్ దశకు చేరుకుంటుంది.
ఒకవేళ గోవా గెలుపొందితే మాత్రం గణాంకాల ప్రకారం సెమీ ఫైనల్స్ బెర్త్ సాధించేందుకు అర్హత సాధించాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన గోవా జట్టుకు సెమీ ఫైనల్స్ బెర్త్ సాధించే అవకాశాలు అత్యల్పం. ఎనిమిది టీంల లీగ్ పాయింట్ల టేబుల్‌లో 12 మ్యాచ్‌లకు 11 పాయింట్లు మాత్రమే పొందింది.

ఢిల్లీ హెడ్ కోచ్ జియాంలుకా జంబ్రొట్టా స్పందిస్తూ 'సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టగలమన్న భావనలో గోవా జట్టు ఉండటం దాని అత్మసంత్రుప్తిని తెలియజేస్తుంది. ఇది అత్యంత పూలిష్ నెస్ చర్య' అని వ్యాఖ్యానించాడు.

Delhi take on Goa in final home match

'ఒకవేళ మేం గెలుపొందితే ఢిల్లీ ప్లేఆఫ్ దశలో కీలకదశకు చేరుకుంటుంది. నేను గణాంకాల్లోకి వెళ్లడం లేదు. కేవలం ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంపైనే ద్రుష్టి సారించాం. అందుకు అనుగుణంగా సిద్ధమయ్యాం. ప్రతిసారి మాదిరిగానే ఈ దఫా కూడా విజయం సాధించాలన్నదే మా సంకల్పం' అని చెప్పాడు. ఢిల్లీ లయన్స్‌కు ఈ దఫా మరో సామర్థ్యం కూడా సొంతమైంది. ప్రస్తుత సీజన్ లో సొంతగడ్డపై ఢిల్లీ ఒక్క మ్యాచ్ కూడా ఓటమి పాలవ్వలేదు. ఈ నేపథ్యంలోనే మిగతా మూడు మ్యాచ్ ల్లో రెండింటిలోనైనా విజయం సాధించగలమని జంబ్రొట్టా దీమాగా ఉన్నాడు. సొంతగడ్డపై గోవాతో జరిగే మ్యాచ్ మాత్రమే ఢిల్లీ జట్టుకు చివరిది. కనుక గోవాతో జరుగనున్నమ్యాచ్‌లో విజయ సాధనకు అవసరమైన కసరత్తంతా జంబ్రొట్టా పూర్తిచేశాడు.

'ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మ్యాచ్ అత్యంత కష్టతరమైన గేమ్స్‌లో ఒకటి. వారి (గోవా) గురించి భిన్నంగా ఆలోచిస్తే తప్పవుతుంది. అది చాలా చెడు అభిప్రాయం. మా ఆటగాళ్లు విజయం వైపు ధ్రుడ నిశ్చయంతో సిద్ధంగా ఉన్నారు' అని జంబ్రొట్టా చెప్పాడు. 2006 వరల్డ్ కప్ విన్నర్ కూడా తమ టీం ఒకసారి గెలుపొందితే ప్లేఆఫ్ దశకు దూసుకెళడం బోనస్ వంటిదేనన్నాడు. తమ అభిమానుల ఆకాంక్షలకు అనుగుణంగా మ్యాచ్ ఆడాల్సిన అవసరం తమ కుర్రాళ్లపై ఉందన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే తాము గోవాపై విజయం సాధిస్తే ప్లేఆఫ్ కోసం మెరుగైన స్థానంలో ఉంటామని, కానీ అందుకోసం తమకు ఆందోళనేమీ లేదన్నాడు. తమ ప్రాథమిక లక్ష్యం ప్లేఆఫ్ దశకు చేరుకోవడమేనన్నాడు.

ఇప్పటికే సెమీస్‌లో ప్రవేశించేందుకు అవకాశాలు కొడిగట్టిపోయినా గోవా హెడ్ కోచ్ జికో సైతం అదే ఊపులో ఉన్నాడు. 'మేం కూడా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఆడతాం. మేం నిపుణులం. పిచ్ మీదకు వెళ్లిన తర్వాత జట్టుకు, ఫ్యాన్స్‌కు, అభిమానుల కోసం యాజమాన్యంపై గౌరవంతో ఆడాల్సి ఉంటుంది. నేను ఫుట్ బాల్ ఆడుతున్నప్పుడే నేర్చుకున్నా మేం మా జెర్సీని ఎల్లవేళలా గౌరవించాలి. మేం 100 శాతం ఎల్లవేళలా దానికి ప్రాధాన్యం ఇస్తాం' అని జికో అన్నాడు.

ఢిల్లీ జట్టుపై గోవా తన సొంతగడ్డపై 0 - 2 స్కోర్ తేడాతో ఓటమి పాలైంది. అయినా ఏ మ్యాచ్‌లోనైనా అండర్ డాగ్స్ మాదిరిగా దూసుకెళ్లాలని తలపోస్తున్నది. గోవా కుర్రాళ్లు సొంత గడ్డపై పెర్పార్మెన్స్‌లో చాలా పేలవంగా డిఫెన్సివ్‌గా ఆడుతూ వెనుకబడి ఉన్నారు. కేవలం 11 పాయింట్లు సాధించిన తర్వాత మూడింట రెండు క్లీన్‌చిట్లు సాధించింది.

'ఆదివారం జరిగే మ్యాచ్ విభిన్నమైనది. మేం ఢిల్లీ (సొంత గడ్డ)పై మ్యాచ్‌లో మేం పాయింట్లు సాధించేందుకు అత్యధికంగా కష్టపడి సమస్యలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. మాకు రిస్క్‌లు తీసుకోవాల్సిన అవసరం లేదు. మేం టీంలో ఆడుతున్నప్పుడు 100 శాతం ప్లేయర్లు ఫిట్‌నెస్ ఉంటేనే భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. చివరి గేం మేం అలసిపోయాం' అని జికో వ్యాఖ్యానించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+