Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

థ్రిల్లింగ్ డ్రా: పోటా పోటీగా ఢిల్లీ, నార్త్ ఈస్ట్ మ్యాచ్

న్యూఢిల్లీ: ఐఎస్ఎల్ 3వ ఎడిషన్ లో అబ్బురపరిచే లీగ్ మ్యాచ్ కు ఢిల్లీ వేదికైంది. ఢిల్లీ డైనమోస్, నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అద్యంతం థ్రిల్లింగ్ గా సాగి చివరకు డ్రాగా ముగిసింది. ఢిల్లీ డైనమోస్ తన సొంతగడ్డపై ఆడిన ఈ తొలి మ్యాచ్ లో ప్రత్యర్థి నార్త్ఈస్ట్‌కు గట్టిపోటీనే ఇచ్చింది.

శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ కుర్రాడు కియాన్ లూయిస్ 38వ నిమిషంలో గోల్ చేసి.. జట్టుకు ఆధిక్యత సాధించగా, సెకండాఫ్ లో 51వ నిమిషంలో నార్త్ ఈస్ట్ స్టయికర్ ఎమిలియానో అల్ఫారో గోల్ సాధించి స్కోర్ సమంచేశాడు. జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంకు భారీస్థాయిలో అభిమానులు తరలి రావడంతో కేరింతలతో హోరెత్తిపోయింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత నార్త్ఈస్ట్ ఐదు మ్యాచ్ లలో 10 పాయింట్లు సాధించి టాప్ లో నిలిస్తే, ఢిల్లీ ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబ్రాకింది. ఇరు జట్లు నెమ్మదిగా మ్యాచ్ ప్రారంభించినా క్రమంగా టెంపో పెరిగింది. పరస్పరం ప్రత్యర్థులపై ఆధిక్యత సాధించేందుకు ఇరు జట్లు విశ్వ ప్రయత్నాలుచేశాయి.

Delhi Dynamos, NorthEast play out the most exciting draw of the season

ప్రారంభంలో నార్త్ఈస్ట్ జట్టుకు బాల్ అందుబాటులో ఉంది. అల్ఫారో, నెకొలాస్ వెలెజ్, కస్తుమి యుసాల త్రయం ప్రత్యర్థులకు ప్రమాదకరంగా కనిపించారు. కానీ ఢిల్లీ.. నార్త్ ఈస్ట్ అవకాశాలను అడ్డుకుంది. 25వ నిమిషంలో యుసా కొట్టిన బంతి వైడ్ గా మారి గోల్ పోస్ట్ ను దాటిపోయింది.

ఆ వెంటనే ఢిల్లీ కుర్రాడు రూబెన్ గోంజాలెజ్ రోచా చేసిన పొరపాటును సద్వినియోగం చేసుకొనేందుకు అల్ఫారో విఫలయత్నం చేశాడు. రోచా పాస్ చేసిన బంతిని వెలెజ్ సంభ్రమకరమైన రీతిలో అందుకుని అల్ఫారోకు పాస్ చేశాడు. కానీ అల్పారో కొట్టిన కిక్ నేరుగా గోల్ పోస్ట్ పక్క నుంచి వెళ్లిపోయింది.

నార్త్ఈస్ట్ గోల్ కీపర్ పొరపాటును సద్వినియోగం చేసుకున్న ఢిల్లీ 38వ నిమిషంలో గోల్ సాధించింది. మార్సెల్లో కార్నర్ నుంచి పంపిన బంతిని సుబ్రతాపాల్ గమనించినా సరిగ్గా అడ్డుకోలేకపోయాడు. ఈ క్రమంలో కియాన్ లూయిస్ బంతిని కార్నర్ ద్వారా గోల్ పోస్ట్ కు పంపాడు.

రెండు జట్ల మధ్య ఉద్వేగం, పాయింట్లు సాధించాలన్న ఆవేశం సెకండాఫ్ ముగిసే వరకూ కానవచ్చింది. రియల్ మాడ్రిడ్ మాజీ డిఫెండర్ రోచా చేసిన రెండో పొరపాటును అనుకూలంగా మార్చుకున్న నార్త్ఈస్ట్ కుర్రాడు ఎమిలియానో అల్ఫారో గోల్ సాధించడంతో స్కోర్ సమమైంది.

నార్త్ఈస్ట్ కోచ్ నెలో వింగాడ, ఢిల్లీ డైనమోస్ కోచ్ జంబ్రొట్టా పరస్పరం తమ ప్రత్యర్థి జట్లపై ప్రశంసలు కురిపించారు. ఈ సీజన్ లోనే ఢిల్లీ వర్సెస్ నార్త్ ఈస్ట్ మ్యాచ్ బెస్ట్ గేమ్ గా నిలుస్తుందని వింగాడ వ్యాఖ్యానించాడు. అద్భుతమైన ఆటతీరుతో ఇరు పక్షాలకు వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని డ్రాగా ముగించారన్నాడు.

ఢిల్లీ కుర్రాళ్లు చాలా మంచి చాన్స్ లు కల్పించారని తెలిపాడు. ఢిల్లీ కోచ్ జంబ్రొట్టా మాట్లాడుతూ నార్త్ఈస్ట్ జట్టు బెస్ట్ ఆట ఆడుతున్నదని కొనియాడాడు. ఆ వెంటనే నార్త్ఈస్ట్ కోచ్ వింగాడ స్పందిస్తూ ఢిల్లీ జట్టు గొప్పదని, గేమ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకూ ఎవరైనా ఏమైనా చేయొచ్చునని అంగీకరించాడు.

సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ ను నియంత్రించడంలో ఢిల్లీ కుర్రాళ్లు విజయం సాధించారని బాలెన్స్ డ్ గా సాగిన మ్యాచ్ గొప్ప ఫలితాన్నిచ్చిందని చెప్పాడు. ఇటువంటి ప్లేయర్లతో ఐఎస్ఎల్ కు, ఇండియన్ ఫుట్ బాల్ కు గొప్పతనం లభిస్తుందన్నాడు.

సెకండాఫ్ కు ఆరు నిమిషాల్లోపు నికోలస్ వెలెజ్, ఎమిలియానో అల్ఫారో సంయుక్తంగా జట్టు స్కోర్ సమంచేసేందుకు సమర్థవంతంగా ప్రయత్నించారని, పిచ్ పై వారిద్దరి ఆటతీరు బ్రహ్మాండంగా ఉందని వింగాడ తెలిపాడు. గతేడాది నుంచి వెలెజ్ తన ఆటను సంఘటిత పర్చుకోవడంలోనూ, ఈ ఏడాదిలో తొలిసారి ఆడుతున్న అల్ఫారో తన నైపుణ్యాన్ని వెలుగులోకి తేవడంలో ప్రతిభ కనబరుస్తూ క్వాలిటీ స్ట్రయికర్ గా నిలిచాడని చెప్పాడు.

సీజన్ ప్రారంభమైన 15 రోజుల్లో తమ క్యాంపెయిన్ గర్వకారణంగా ఉన్నదని చెప్పాడు. ఢిల్లీ కోచ్ జంబ్రొట్టా మాట్లాడుతూ తమ ప్రత్యర్థి జట్టు శక్తిమంతమైందని మరిచిపోవద్దని అన్నాడు. ఈ రోజు జరిగిన మ్యాచ్ బెస్టని వ్యాఖ్యానించాడు. తమకు మూడు, నాలుగు సార్లు గోల్ చేసేందుకు వచ్చిన అవకాశాలను మిస్సయినా తాను సంతోషంగానే ఉన్నానని చెప్పాడు.

ఢిల్లీ గోల్ కీపర్ టోనీ డొబ్లాస్ మాట్లాడుతూ నార్త్ ఈస్ట్ కుర్రాళ్లు చాలా బాగా ఆడుతూ మంచి చాన్స్ లు కల్పించారని, పలుసార్లు ప్రత్యర్థి గోల్స్ చేసే అవకాశాలను విజయవంతంగా అడ్డుకున్నారని తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+