For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఐఎస్ఎల్: నాలుగో విజయంపై ఢిల్లీ డైనమోస్ ‘ఐ’

By Nageshwara Rao

న్యూఢిల్లీ: వరుసగా నాలుగో విజయంపై ఢిల్లీ డైనమోస్ కన్నేసింది. న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ అథ్లెటిక్ స్టేడియంలో ఆదివారం రాత్రి మాజీ చాంపియన్లు అట్లెటికో డీ కోల్ కతాతో తల పడనున్నది. అసాధారణ రీతిలో ఫామ్ కలిగి ఉన్న ఢిల్లీ డైనమోస్ జట్టు సొంతగడ్డపై మరింత ఆత్మ విశ్వాసంతో ఆడుతుంది.

ఇంతకుముందు కేరళ బ్లాక్ బస్టర్స్ పై 2 - 0, డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ పై 4 - 1 స్కోర్ తేడాతో సంచలన విజయాలు సాధించిన డైనమోస్ తొమ్మిది మ్యాచ్ ల్లో 16 పాయింట్లతో టాప్ 4లో అగ్ర స్థానంలో నిలిచింది. దాదాపు సెమీ ఫైనల్స్ లో ఆడేందుకు అర్హత సాధించే దిశలో ఢిల్లీ కుర్రాళ్ల పయనం సాగుతున్నది.

ఈ ఏడాది ప్రారంభంలో అట్లెటికో డీ కోల్ కతా చేతిలో ఓటమి పాలైన ఢిల్లీ.. దానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం వేచి చూస్తున్నది. ఈ సీజన్‌లో ఢిల్లీని కోల్‌కతా జట్టు మాత్రమే ఓడించగలిగింది మరి. ఈ నేపథ్యంలో జట్టు కోచ్ జంబ్రొట్టా తన కుర్రాళ్లకు ప్రత్యేకంగా హితబోధ చేశాడు.

కానీ తమకు ప్రతీకారంపై నమ్మకం లేదని, మంచి టీంపై మంచి మ్యాచ్ ఆడాలని మాత్రమే తమ కుర్రాళ్లకు చెప్పానని జంబ్రొట్టా తెలిపారు. గోల్స్ సాధించగల శక్తి సామర్థ్యాలు ఉన్న ప్లేయర్లు పుష్కలం. మార్సిలిన్హో, రిచర్డ్ గాడ్జె, సారధి ఫ్లోరెంట్ మాలౌదా, కియాన్ లూయిస్ గోల్స్ సాధనలో ఎవరికి వారే స్పెషల్.

మార్సిలిన్హో 5, గాడ్జె మూడు, కియాన్ లూయిస్ మూడు గోల్స్ సాధిస్తే.. చెన్నైయిన్ పై సారధి మాలౌదా రెండు గోల్స్ సాధించాడు. అయితే వ్యక్తిగతంగా ఏ క్రీడాకారుడి పట్ల ప్రత్యేక అభిమానమేమీ లేదని, తమ కుర్రాళ్లు ఫలితాలు సాధించడమే తనకు ముఖ్యమన్నాడు.

మరోవైపు అట్లెటికో డీ కోల్ కతా ఇంతకుముందు ఫుణె సిటీ చేతిలో 2-1 ఓటమి భారంతో తిరిగి విజయ మార్గాల కోసం అన్వేషణ సాగిస్తున్నది. అంతేకాదు టాప్ 4లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని తలపోస్తున్నది. 2014లో ఐఎస్ఎల్ లీగ్ లీడర్లుగా తమ స్థిర ప్రయాణాన్ని సాగిస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉన్నది.

తొలి ఏడాది ఢిల్లీ డైనమోస్ తో జరిగిన రెండు మ్యాచ్ లు డ్రాగా ముగిసాయి. గతేడాది ఢిల్లీ డైనమోస్ ఒక మ్యాచ్ లో విజయం సాధిస్తే మరో మ్యాచ్ లో డ్రాగా ముగించింది. ఈ ఏడాది ప్రారంభంలోనూ అట్లెటికో డీ కోల్ కతా తన సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో 1 - 0 స్కోర్ తేడాతో గెలుపొందింది.

పుణె జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఎటికె ఓటమి పట్ల డిజప్పాయింటైన కోచ్ మొలినా తాము అవసరమైన మేరకు ప్రాక్టీస్ చేశామని, అయినా ఫలితం దక్కలేదన్నాడు. పుణె మ్యాచ్ ఓటమి తమకు మంచి పరిణామం కాదని, కానీ ఫుట్ బాల్ వంటి ఆటలో సహజమేనన్నారు. ప్రతి మ్యాచ్ విభిన్నమని వ్యాఖ్యానించాడు. ఇయాన్ హుమ వంటి ప్లేయర్లు చెలరేగిపోవాలని మొలీనా ఆకాంక్షిస్తున్నాడు. గత సీజన్ లో హుమ్ 19 గోల్స్ సాధించాడు. ఇదే గతేడాది గోల్స్ లో అత్యధిక రికార్డు.

డిఫెన్స్‌కు రోచా.. క్రియేటివిటిలో పొస్టిగ

డిఫెన్స్‌కు రోచా.. క్రియేటివిటిలో పొస్టిగ

ఢిల్లీ డైనమోస్‌లో రుబెన్ రోచా నిరంతరం సాలిడ్ పెర్పార్పెన్స్ ఉన్న ప్లేయర్లలో ఒకడు. తరుచుగా డిఫెన్సివ్ బెడ్ రాక్‌పై పత్యర్థి స్ట్రయికర్ల అటాకింగ్ ను అడ్డుకుని గోల్స్ చేయకుండా నిలువరించడంలో బెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. గోల్ పోస్ట్ బాక్స్ చుట్టూ కార్నర్లలో ప్రత్యర్థి జట్లకు హడల్. ఇక అట్లెటికో డీ కోల్ కతా సారధి హెల్డర్ పొస్టిగ గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరమైనా జట్టుతో జత కలిసినప్పటి నుంచి క్రియేటివిటీగా ఆడుతూ ముందుకు సాగుతున్నాడు. ప్రత్యేకించి నార్త్ఈస్ట్ జట్టును మట్టి కరిపించడంలో పొస్టిగ కీలక పాత్ర పోషించాడు. అనుభవం గల ప్లేయర్ గా, క్రియెటివ్ ఆటగాడిగా పొస్టిగ పట్ల ఢిల్లీ డైనమోస్ అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఢిల్లీకి ఫ్లోరెంట్.. ఎటికేకు బోర్జా కీలకం

ఢిల్లీకి ఫ్లోరెంట్.. ఎటికేకు బోర్జా కీలకం

ఢిల్లీ డైనమోస్ సారధి ఫ్లోరెంట్ మాలౌదా జట్టుకే అత్యవసరమైన ప్లేయర్. సారధిగా ఫ్లోరెంట్ అటాకింగ్ వ్యూహాల రూపకల్పనలోనూ, ప్రత్యర్థి జట్టులోకి చొచ్చుకెళ్లి బంతులను తస్కరించడంలోనూ నేర్పరి. ఇంతకుముందు డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నైయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సుదూరం నుంచి బంతిని సొగసైన షాట్లతో గోల్ పోస్ట్ దారి పట్టించడంలోనూ మేటి. ఆదివారం నాడు గోల్స్ సాధన కోసం మరింత ఆర్తిగా దూసుకెళ్లగలడంటే అతిశేయోక్తి కాదు. 2014లో ఐఎస్ఎల్ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి అట్లెటికో డీ కోల్ కతా జట్టుకు బోర్జా ఫెర్నాండెజ్ ఎంతో ఆధారం. స్పానియార్డ్ లింక్ ప్లేయరైన బోర్జా మ్యాచ్‌లో ఆయా పరిస్థితులకు అనుగుణంగా వ్యూహ రచన సామర్థ్యంతో ముందుకు తీసుకెళ్లడం, ఫార్వర్డ్ లైన్‌పై ఫర్మిడియబుల్ ప్లేయర్. అట్లెటికో డీ కోల్ కతా సారధి పొస్టిగకు బొర్జా అంటే నమ్మకం కూడా.

గోల్స్ సాధించడంలో కియాన్ లూయిస్ కీలక పాత్ర

గోల్స్ సాధించడంలో కియాన్ లూయిస్ కీలక పాత్ర

కియాన్ లూయిస్ తన సొంత సీజన్లో తిరిగి అడుగు పెట్టాడు. పలు దఫాలు మధ్యలో తెలివిగా ప్రత్యర్థులను ఢీ కొట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాడు. గోల్స్ సాధించడంలో కీలకంగా వ్యవహరించే లూయిస్ కోల్‌కతా బ్యాక్ లైన్‌ను కకావికలం చేయగల సామర్థ్యం లూయిస్ సొంతం. అత్యంత ప్రతిభ కనబరుస్తున్న లూయిస్ గురించి కోల్ కతా అప్రమత్తంగా వ్యవహరిస్తే మంచిది. ఇక బోర్జా ఫెర్నాండెజ్ మాదిరిగా అట్లెటికో డీ కోల్ కతా సక్సెస్ స్టోరీలో ప్రభావిత స్థాయి గల ప్లేయర్ అర్నాబ్ మొండాల్. ఇండియా ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిన మొండాల్.. ఫీల్డ్ లో అసాధారణ రీతిలో పాస్ లు అందిస్తూ.. ప్రత్యర్థికి అటాకింగ్ వ్యూహ నిర్మాణంలో బెస్ట్. ఎక్కువ ఎత్తు ఉండటం కూడా ఆయనకు కలిసొచ్చే అంశం. ప్రత్యర్థులకు మొండాల్ అనునిత్యం ముప్పంటే అతిశేయోక్తి కాదు.

 జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సి: అంటోనియో డొబ్లాస్ సంతానా, సంజీబన్ ఘోష్, సోరం పౌరెరీ, రుబెన్ గొంజాలెజ్ రోచా, డేవిడ్ అడ్డీ, ఇబ్రహిమా నియాస్సే, అనాస్ ఎడాథోడికా, ఛింగ్లేంసానా కొంశం సింగ్, లాల్చావంకిమా, రూపర్ట్ దేవదాస్, మిలాన్ సింగ్, మలా్సవాంజౌలా, రిచర్డ్ గాడ్జె, బదారా బాద్జీ, అర్జున్ తుడు, మార్సెల్లో లైటీ పెరీరా, కియాన్ లూయిస్, ఆమోస్ దో, అల్విన్ జార్జి.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+