Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Fifa World Cup 2022: వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన ఫ్రాన్స్.. సెమీస్ లో మొరాకో చిత్తు

 Defending champion France defeats Morocco to reach finals

ఫిఫా వరల్డ్ కప్ 2022లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ అదరగొట్టింది. క్వార్టర్ ఫైనల్స్ లో 2-1 తేడాతో ఇంగ్లండ్ ను ఓడించిన ఫ్రాన్స్.. సెమీస్ కు దూసుకొచ్చింది. అదే సమయంలో పోర్చుగల్ వంటి బడా జట్టును ఓడించిన మొరాకో.. సెమీస్ చేరిన తొలి ఆఫ్రికా దేశంగా రికార్డ్ సృష్టించింది. ఫ్రాన్స్ ను కూడా ఓడించి మరో సంచలనం సృష్టించాలని మొరాకో భావించింది. కానీ ఆ ప్రయత్నంలో ఈ జట్టు పూర్తిగా విఫలమైంది.

సెమఫైనల్ మ్యాచ్ అద్భుతంగా ప్రారంభమైంది. మ్యాచ్ ఆరంభమైన ఐదు నిమిషాల్లోనే ఫ్రాన్స్ తొలి గోల్ చేసింది. మొరాకో డిఫెన్స్ లోకి దూసుకెళ్లిన థియో ఫెర్నాండెజ్.. పెనాల్టీ ఏరియాలోకి వెళ్ళిపోయాడు. అక్కడ బంతిని అందుకొని అద్భుతంగా గోల్ చేశాడు. దీంతో ఫ్రాన్స్ మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే 1-0 ఆధిక్యంలో నిలిచింది. స్కోర్లు సమం చేయడానికి మొరాకో చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఆ గోల్స్ తేడాతోనే తొలి హాఫ్ ముగిసింది.

తొలి హాఫ్ లో 1-0 తో పైచేయి సాధించిన ఫ్రాన్స్ ను సెకండ్ హాఫ్ లో మొరాకో భయపెట్టింది. ఎడాపెడా షాట్లు ఆడుతూ గోల్స్ చేసే ప్రయత్నం చేసింది. గొప్ప ఇంటెంట్ చూపించింది. ఈ హాఫ్ లో 66 శాతం బంతిని తమ కంట్రోల్ లో ఉంచుకుంది. కానీ ఎంత ప్రయత్నించినా మొరాకో గోల్ చేయలేకపోయింది. మధ్యలో ఫ్రాన్స్ తరఫున వచ్చిన రండాల్ కోలో మౌని.. ఆ జట్టు ఆధిక్యాన్ని 2-0 కు పెంచాడు. దీంతో మొరాకో అభిమానులు, జట్టు తమ పట్టుదల కోల్పోయినట్లు స్పష్టంగా కనిపించింది. చివరకు ఫ్రాన్స్ ఈ మ్యాచ్ గెలిచి వరుసగా రెండోసారి ఫైనల్ చేరుకుంది. ఫైనల్ లో అర్జెంటీనాను ఫ్రాన్స్ ఎదుర్కుంటుంది.

Story first published: Thursday, December 15, 2022, 9:14 [IST]
Other articles published on Dec 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+