వాషింగ్టన్ : అతను కామిక్ హీరో అయ్యాడు. అతని మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. అతనే డేవిడ్ బెక్ హామ్. దక్షిణాఫ్రికాలో జరిగే ఫుట్ బాల్ ప్రపంచ కప్ కవరేజీ కోసం ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు డేవిడ్ బెక్ హామ్ యాహూను ఎంచుకున్నాడు. వరల్డ్ కప్ పై అతని అభిప్రాయాలను ఇంటర్ నెట్ లో పంచుకోనున్నాడు. యాహూ స్పోర్ట్స్ లోని డేవిడ్ బెక్ హామ్ చానెల్ లో ఇవి ప్రసారం అవుతాయి. యాహూ మార్కెటింగ్ కోసం కూడా ఈ మిడ్ ఫీల్డర్ తన వంతు పాత్రను పోషించనున్నాడు. ఆట గురించి ఫుట్ బాల్ అభిమానులతో మాట్లాడే అవకాశాన్ని యాహూ కల్పించింది. గేమ్ అంటే నాకు చాలా ఇష్టం అని బెక్ హామ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.