ఏషియన్ కప్ తర్వాత జపానీస్ ప్లేయర్ డైజన్ మేదా చాలా మెరుగ్గా కనిపిస్తున్నాడని స్కాటీష్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ సెల్‌టిక్ మేనేజర్ బ్రెండన్ రోజర్స్ అన్నాడు. ఏషియన్ కప్ కోసం జట్టు వీడినప్పటి కంటే ఇప్పుడు ఆట పరంగా ఎంతో మెరుగయ్యాడని తెలిపాడు. సిన్చ్ ప్రీమియర్‌షిప్‌లో భాగంగా బుధవారం హిబెర్నియన్ జట్టుతో జరిగే మ్యాచ్‌లో డైజన్ మేదా ఫార్వర్డ్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతాడని బ్రెండన్ రోజర్స్ తెలిపాడు.

ఇరాన్‌తో శనివారం జరిగిన క్వార్టర్-ఫైనల్లో జపాన్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో డైజన్ మేదా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మైదానంలో వేగంగా కదులుతూ బంతిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. 26 ఏళ్ల డైజన్ మేదా.. ఏషియన్ కప్ టోర్నీకి ముందు మోకాలి గాయంతో బాధపడ్డాడు. ఈ గాయం కారణంగా ప్రీమియర్‌షిప్ వింటర్ సీజన్‌కు దూరంగా ఉన్నాడు.
అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తర్వాత మైదానంలో డైజన్ మేదా వేగం పెరిగిందని బ్రెండన్ రోజర్స్ అభిప్రాయపడ్డాడు. 'డైజన్ మేదా రీఎంట్రీ ఇచ్చాడు. ఇది మా జట్టుకు గొప్ప న్యూస్. అతను ఫిట్‌గా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉన్నాడు. జట్టును వీడే సమయంలో కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా కనిపిస్తున్నాడు. ఎందుకంటే అప్పటి కంటే అతను మైదానంలో చాలా వేగంగా కదులుతున్నాడు.
జట్టుకు దూరమైన అతను ట్రైనింగ్ తీసుకోవడంతో పాటు కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. రీఎంట్రీ నేపథ్యంలో అతనితో మాట్లాడాను. తన అవసరం ఉంటే సెల్‌టిక్ జట్టు తరఫున బరిలోకి దిగేందుకు అతను సిద్దంగా ఉన్నాడు.
అబర్డీన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సెట్లిక్ 1-1తో డ్రా చేసుకుంది. దాంతో తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసేందుకు సెట్లిక్ ఇష్టపడటం లేదు. పిక్క గాయంతో బాధపడుతున్న గ్రేగ్ టేలర్.. గాయం నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. స్కాటిష్‌కప్‌లో భాగంగా సెయింట్ మిర్రెన్‌తో ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో లెఫ్ట్ బ్యాక్ ప్లేయర్ అయిన గ్రేగ్ టేలర్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
'వారాంతంలో అతను ఎలా ఉంటాడో అనేది చూసి తుది నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం అతను బాగానే కదులుతున్నాడు. మెడికల్ టీమ్ పర్యవేక్షణలోనే ఉన్నాడు. అతను పూర్తిగా కోలుకుంటే ఆదివారం జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడు.'అని రోజర్స్ చెప్పుకొచ్చాడు.