Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నెదర్లాండ్స్‌కు షాకిచ్చిన జపాన్.. ఆఖరి నిమిషంలో మారిన ఫలితం!

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో నెదర్లాండ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. నెదర్లాండ్స్ విజయాన్ని జపాన్ అడ్డుకుంది. సోమవారం తెల్లవారుజామున డల్లాస్ వేదికగా నెదర్లాండ్స్, జపాన్ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసింది.

నెదర్లాండ్స్ విజయం లాంఛనం అనుకున్న స్థితిలో ఆఖరి నిమిషంలో జపాన్ గోల్ నమోదు చేసి స్కోర్లను సమం చేసింది. జపాన్ స్టార్ ప్లేయర్ దైచి కమడ 88వ నిమిషంలో గోల్ కొట్టి నెదర్లాండ్స్ విజయాన్ని అడ్డుకున్నాడు.


బోరింగ్‌గా ఫస్టాప్..

మ్యాచ్ ప్రారంభమైన మూడో నిమిషంలోనే డోన్యెల్ మాలెన్ కొట్టిన శక్తివంతమైన షాట్‌ను జపాన్ గోల్ కీపర్ జియాన్ సుజుకి అద్భుతంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత రెండు జట్లు రక్షణాత్మక ధోరణిలో ఆడటంతో తొలి అర్ధభాగంలో గోల్స్ నమోదు కాలేదు. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి జపాన్ ప్లేయర్ కేతో నకమురాకు గోల్ చేసే అవకాశం వచ్చినప్పటికీ..బంతి పోస్ట్ బయటకు వెళ్ళింది.

Daichi Kamada s Late Heroics Seal Dramatic 2-2 Draw for Resilient Japan Against Netherland

సెకండ్ హాఫ్‌లో వరుస గోల్స్

సెకండాఫ్ ప్రారంభమైన ఆరు నిమిషాలకే (51వ నిమిషంలో) ర్యాన్ గ్రావెన్‌బెర్చ్ అందించిన పాస్‌ను నెదర్లాండ్స్ సీనియర్ డిఫెండర్ వర్జిల్ వాన్ డిక్ హెడర్ ద్వారా గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే ఈ సంతోషం నెదర్లాండ్స్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. 57వ నిమిషంలో జపాన్ ప్లేయర్ నకమురా అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో స్కోరును 1-1తో సమం చేశాడు.

ఆ తర్వాత 64వ నిమిషంలో నెదర్లాండ్స్ ప్లేయర్ క్రిసెన్సియో సమ్మర్‌విల్లే తన కెరీర్‌లో డచ్ జట్టు తరపున తొలి గోల్ నమోదు చేస్తూ స్కోరును 2-1కి తీసుకెళ్లాడు. దీంతో నెదర్లాండ్స్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ 88వ నిమిషంలో జపాన్‌కు లభించిన కార్నర్ కిక్‌ను కోకి ఒగావా హెడర్ చేయగా.. అది కాస్తా దైచి కమడకు తగిలి గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. డచ్ కీపర్ బార్ట్ వెర్‌బ్రుగెన్ అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.

జపాన్ సెకండ్ హాఫ్ మ్యాజిక్:

వరల్డ్ కప్‌లో జపాన్ జట్టు సెకండాఫ్‌లో ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ మ్యాచ్‌తో మరోసారి రుజువైంది. టోర్నీలో వారు చేసిన గత 10 గోల్స్‌లో 9 గోల్స్ సెకండ్ హాఫ్‌లోనే రావడం విశేషం. ఈ అద్భుత ప్రదర్శనతో జపాన్ గ్రూప్ దశలో కీలకమైన ఒక పాయింట్‌ను సొంతం చేసుకుంది.

Story first published: Monday, June 15, 2026, 10:23 [IST]
Other articles published on Jun 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+