Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Curtis Jones: నా టైమ్ నడుస్తోంది... లివర్‌పూల్‌ జట్టుకు విజయాలందిస్తా!

ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ లివర్‌పూల్ ఫుట్‌‌బాల్ క్లబ్ మిడ్‌ఫీల్డర్ కర్టిస్ జోన్స్ తన 23వ జన్మదినం నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లివర్ పూల్ ఫుట్‌బాల్ క్లబ్‌లో కీలక పాత్ర పోషించేందుకు తన సమయం ఆసన్నమైందని తెలిపాడు.

గత మంగళవారం(జనవరి 30)తో 23వ ఏట అడుగుపెట్టిన కర్టిస్ జోన్స్.. ఐదేళ్ల క్రితమే సీనియర్ ఫుట్‌బాల్ టోర్నీలో అరంగేట్రం చేశాడు. కానీ ఇప్పటి వరకు సరైన ప్రదర్శన చేయలేకపోయాడు. జట్టులో కొనసాగుతూ అనుభవాన్ని గడించిన ఈ కుర్రాడు.. గతేడాది గాయంతో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు.

Liverpool’s Curtis Jones celebrates scoring

ఈ సీజన్‌లో రీఎంట్రీ ఇచ్చిన కర్టిస్ జోన్స్.. అసాధారణ ప్రదర్శనతో గోల్స్ మోత మోగిస్తున్నాడు. గత వారం జరిగిన ఎఫ్‌ఏ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నార్విచ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క గోల్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాటు తన గోల్స్ సంఖ్యను ఐదుకు పెంచుకున్నాడు.

లివర్‌పూల్ మేనేజర్ జుర్గెన్ క్లోప్ తనపై ఉంచిన నమ్మకాన్ని కర్టిస్ జోన్స్‌ నిలబెట్టుకున్నాడు. 4-1తో చెల్సియాపై సాధించిన విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ప్రీమియర్ లీగ్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న లివర్‌పూల్ జట్టు ఆధిక్యం పెరిగింది. మాంచెస్టర్ సిటీ కంటే ఐదు పాయింట్స్ లీడ్‌లో ఉండేలా చేసింది.

ఈ విజయంపై కర్టిస్ జోన్స్ సంతోషం వ్యక్తం చేశాడు. 'ప్రస్తుతం నా సక్సెస్ చాలా ఆనందాన్నిస్తోంది. గాయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేను.. ఇలా రీఎంట్రీ ఇచ్చి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉంది. స్వేచ్చగా ఆడుతూ.. గోల్స్ చేస్తున్నాను. జట్టు విజయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాను. ప్రస్తుతం నా టైమ్‌ నడుస్తోంది. ఇదే జోరును కొనసాగిస్తాను.

Liverpool

17 ఏళ్ల వయసులో అవకాశాల కోసం జట్టు చుట్టూ తిరిగాను. చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాను. మేనేజర్ జుర్గెన్ క్లోప్ అండగా నిలిచాడు. నీ టైమ్ వస్తుందని వెన్ను తట్టేవాడు. ఇప్పుడు నా టైమ్ నడుస్తోంది. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. నా ఆటను కూడా చాలా మెరుగుపరుచుకున్నాను.'అని కర్టిస్ జోన్స్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, February 1, 2024, 23:13 [IST]
Other articles published on Feb 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+