పుట్‌బాల్: బంతి ఛాతికి తలగలడంతో ప్రాణాలు కోల్పోయిన ఆటగాడు

హైదరాబాద్: పుట్‌బాల్‌లో చోటు చేసుకున్న వరుస సంఘటనలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. బంతి దగ్గర నుంచి ఛాతికి బలంగా తాకడంతో ఓ ఆటగాడు మైదానంలోనే కుప్పకూలిపోయిన సంఘటన క్రొయేషియాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటగాడు మైదానంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
క్రొయేషియన్ థర్డ్ డివిజన్ ఫుట్‌బాల్ లీగ్‌లో మార్సోనియా ఆటగాడు బ్రునో బోడన్ (25) శనివారం స్లావోన్జియాతో మ్యాచ్ ఆడుతున్నాడు. ఆట ప్రారంభమైన 10 నిమిషాల్లోనే అతని ఛాతికి అతి సమీపంలో బంతి బలంగా తాకింది. దీంతో ఉన్నట్టుండి అతడు మైదానంలోనే కుప్పకూలిపోయాడు.
వెంటనే మ్యాచ్‌ని నిలిపివేసి అతడి సహచర ఆటగాళ్లు హటాహుడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. బంతి తాకిన సమయంలో అతనికి గుండెపోటు వచ్చిందని.. దీంతో వెంటనే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. బోడన్ మృతి పట్ల క్రొయేషియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది.
చనిపోయే సమయానికి బోడన్ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. ఇటలీ జువెంటోస్ క్లబ్ తరుపున ఆడుతున్న క్రోయేషియాకు చెందిన మారియో మాండ్జుక్ అనే ఆటగాడు తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో బోడన్‌కు తన సానుభూతిని తెలియజేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications