Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Fifa World Cup 2022: క్రొయేషియాదే మూడో స్థానం.. మొరాకోపై 2-1 తేడాతో విజయం

Croatia wins the battle for third place in Fifa World Cup

ఫిఫా వరల్డ్ కప్‌లో మూడో స్థానం కోసం జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో క్రొయేషియా విజయం సాధించింది. సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా దేశం మొరాకోతో ఈ మ్యాచ్‌ జరిగింది. ఈ క్రమంలో రెండు జట్లు మంచి ఫుట్‌బాల్ ఆడి అభిమానులకు చక్కని వినోదాన్ని పంచాయి. రెండు జట్లు కూడా అద్భుతమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశమే ఇవ్వలేదు. అయితే మ్యాచ్ ఆరంభమైన ఆరో నిమిషంలోనే క్రొయేషియాకు ఒక ఫ్రీ కిక్ లభించింది. దాన్ని ఆ జట్టు గోల్‌గా మలిచి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అయితే మొరాకో కూడా వెంటనే మరో గోల్ చేసి సత్తా చాటింది. తనకు దక్కిన ఫ్రీ కిక్‌ను మొరాకో ప్లేయర్ హకీమ్ జియేచ్ గోల్ చేశాడు. దీంతో రెండు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. ఆ తర్వాత రెండు జట్లూ కూడా ఆధిక్యం కోసం గట్టిగా ప్రయత్నాలు చేశాయి.

Croatia wins the battle for third place in Fifa World Cup

ఈ క్రమంలోనే ప్రత్యర్థులు చేసిన ఎటాక్‌ను యాసిన్ బ్యూనో అద్భుతంగా సేవ్ చేశాడు. అయితే స్కోర్లు సమం అయిన తర్వాత క్రొయేషియానే ప్రమాదకరమైన జట్టులా కనిపించింది. ఎటాకింగ్ గేమ్ ఆడిన ఆ జట్టు మరో మూడు నిమిషాల్లో హాఫ్ టైం ముగుస్తుందనగా మరో గోల్ సాధించింది.

Croatia wins the battle for third place in Fifa World Cup

క్రొయేషియా రైట్ బ్యాక్ జోసిప్ స్టానిసిక్ బంతిని మాయెర్‌కు పాస్ చేశాడు. కానీ దాన్ని అతను సరిగా అందుకోలేక పోవడంతో బంతి నేరుగా మొరాకో డిఫెండర్ సఫయాన్ అమ్రబాత్‌ వైపు వెళ్లింది. అతను దాన్ని క్లియర్ చేయడంలో విఫలమయ్యాడు.

Croatia wins the battle for third place in Fifa World Cup

ఈ బంతి అటు తిరిగి ఇటు తిరిగి క్రొయేషియా ప్లేయర్ మిస్లావ్ ఓర్సిక్ దగ్గరకు చేరుకుంది. అతను దాన్ని అద్భుతమైన షాట్‌తో గోల్ చేశాడు. దీంతో క్రొయేషియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రెండు జట్లు గోల్ చేయలేకపోయాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన క్రొయేషియా ఫిఫా వరల్డ్ కప్ 2022లో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

Story first published: Sunday, December 18, 2022, 9:24 [IST]
Other articles published on Dec 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+