న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

రష్యాను పడగొట్టి.. సెమీ ఫైనల్‌కి చోటు దక్కించుకున్న క్రొయేషియా

Croatia book World Cup semi-final with England after penalty shootout win

హైదరాబాద్: ఎవరూ ఊహించని రీతిలో క్వార్టర్ ఫైనల్స్ వరకూ దూసుకొచ్చిన రష్యాకు సెమీ ఫైనల్‌లో నిరాశ తప్పలేదు. నాకౌట్‌ దశలో పటిష్ట స్సెయిన్‌పై పెనాల్టీ షూటౌట్‌లో గెలిచిన రష్యా.. క్వార్టర్స్‌లో అదే పెనాల్టీ షూటౌట్‌లో 3-4తో ఓటమి పాలై ఇంటిముఖం పట్టింది. దీంతో సెమీస్‌కు చేరిన నాలుగో జట్టుగా క్రొయేషియా నిలిచింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే క్రొయేషియా బంతిపై స్పష్టమైన ఆధిపత్యం సాధించినా.. తొలి గోల్‌ మాత్రం రష్యా నమోదు చేసింది.

31నిమిషంలో రష్యా ఆటగాడు చెరిసెవ్‌ తొలి గోల్‌ కొట్టి రష్యాకు ఆధిక్యాన్ని అందించాడు. తర్వాత వెంటనే పుంజుకున్న క్రొయేషియా కూడా 39నిమిషంలోనే తొలి గోల్‌ కొట్టింది. క్రమారిక్‌ గోల్‌ కొట్టి స్కోరును 1-1కి సమం చేశాడు. మరో గోల్‌ కోసం ఇరు జట్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మ్యాచ్‌ తొలి అర్ధభాగం 1-1తో ముగిసింది.

అనంతరం మొదలైన రెండో అర్ధభాగంలోనూ క్రొయేషియా ఆతిథ్య జట్టు గోల్‌ పోస్ట్‌పై పదేపదే దాడులు చేసినా ఫలితం లేకుండా పోయింది. మరో గోల్‌ నమోదు కాకపోవడంతో మ్యాచ్‌ అదనపు సమయానికి దారితీసింది. అయితే అదనపు సమయం ప్రారంభమైన కాసేపటికే 101నిమిషంలో క్రొయేషియా ఆటగాడు విడా గోల్‌ చేసి ఆధిక్యాన్ని 2-1కి పెంచాడు. ఇక అప్పటినుంచి బంతిని నియంత్రణలో పెట్టుకొని క్రొయేషియా.. ఆతిథ్య జట్టుకు మరో గోల్‌ కొట్టే అవకాశం ఇవ్వలేదు.

కానీ, అనుకోని రీతిలో 115నిమిషంలో రష్యా ఆటగాడు ఫెర్నాడెస్‌ ఫ్రీకిక్‌ ద్వారా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. దాన్ని కాస్తా హెడర్‌గోల్‌గా మలచడంతో స్కోరు 2-2కి సమం అయింది. దీంతో అదనపు సమయంలోనూ స్కోరు సమం కావడంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌పై ఆధారపడక తప్పలేదు. ఈ క్రమంలో పెనాల్టీ షూటౌట్‌లో క్రొయేషియా 4-3తో విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

Story first published: Sunday, July 8, 2018, 16:11 [IST]
Other articles published on Jul 8, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X