క్రిస్టియానో రొనాల్డోకే బాల్లోన్ డి’ఓర్ అవార్డు?
హైదరాబాద్: ఈ ఏడాది బాల్లోన్ డి'ఓర్ అవార్డును పోర్చుగీస్ సూపర్ స్టార్ ప్లేయర్, స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ 'లా లీగ' జెయింట్ రియల్ మాడ్రిడ్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకే దక్కుతుందని ప్రముఖ స్పానిష్ మీడియా సంస్థ ముండో డిపోర్టివో ధ్రువీకరిస్తూ వార్తాకథనం ప్రచురించింది. ఈ ఏడాది ఫుట్‌బాల్ ఆటగాళ్లలో మేటి, ప్రజాదరణ పొందిన సూపర్ స్టార్ అని తేలింది.
ఈ నెల 12వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు క్రిస్టియానో రొనాల్డోను ఈ అవార్డు విజేతగా ప్రకటిస్తారని పేర్కొంది. మూడేళ్లలోగా రెండోసారి (యుఎఎఫ్ఎ) చాంపియన్స్ లీగ్ టోర్నీ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించినందుకు 2016లోనే రొనాల్డోను బెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా అవార్డు నిర్వాహకులు పరిగణించారు.
అండర్ డాగ్స్‌గా ఉన్న పోర్చుగల్ టీంకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 'యూరో కప్ 2016'ను గెలుచుకోవడంలోనూ ఆయన ముఖ్యమైన పాత్ర పోషించడం కూడా కారణమే. పోర్చుగల్ టీం సారధిగా జట్టును ముందుకు తీసుకెళ్లి యూరో 2016 టైటిల్ గెలుచుకోవడం తక్కువేం కాదు.

అవార్డు రేసులో మెస్సీతోపాటు నేయ్మార్
ఈ అవార్డు కోసం రొనాల్డోతోపాటు రియల్ మాడ్రిడ్ చిరకాల ప్రత్యర్థి బార్సిలోనా ఎఫ్ సి ప్లేయర్ లియానెల్ మెస్సీతోపాటు నేయ్మార్, లూయిస్ సౌరెజ్, అట్లెటికో మాడ్రిడ్ స్టార్ అంటౌనియో గ్రైజ్మన్ కూడా పోటీ పడుతున్నారు. చాంపియన్స్ లీగ్, యూరో కప్ టైటిళ్లను గెలుచుకునేందుకు అత్యంత చేరువలోకి చేరుకున్నందుకు గ్రైజ్మన్ కు 2016 ఒక అద్భుతమైన వసంతమే. 2016 చాంపియన్స్ లీగ్, యూరో 2016 టోర్నీల్లో ఫైనల్స్‌కు చేరుకున్నా గ్రైజ్మన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఫ్రాన్స్ జట్టు రన్నరప్ స్థానంతో సంత్రుప్తి పడాల్సి వచ్చింది. నిర్ధారణ గానీ వార్తలు, నివేదికలు నిజమైతే రొనాల్డోకు ఇది నాలుగో బాల్లోన్ డి'ఓర్ అవార్డు. లియానెల్ మెస్సీ కంటే ఒక అవార్డు తక్కువ.

ఇపిఎల్ టోర్నీలో అద్భుతమైన ఆటతీరు
చెల్సియా స్టార్ ఎడెన్ హజార్డ్ బోనస్ సంగతి బయటకొచ్చింది. ప్రీమియర్ లీగ్ 2015 ప్లేయర్‌గా చెల్సియా స్టార్ ప్లేయర్ ఎడెన్ హజార్డ్ 2.5 మిలియన్ల డాలర్ల బోనస్ అందుకున్నసంగతి బయటపడింది. ఫ్రాన్స్ క్లబ్ లిల్లే జట్టు నుంచి ఎడెన్ హజార్డ్ తమ జట్టులోకి చేర్చుకునేందుకు చెల్సియా యాజమాన్యం 42.9 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అవగాహన కుదిరినట్లు సమాచారం. లిల్లే క్లబ్ ఇదే హజార్డ్ కు 34.4 మిలియన్ డాలర్లు చెల్లించిందని బెల్జియన్ దినపత్రిక లేసౌర్ వార్తాకథనం ప్రచురించింది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) టోర్నీలో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించినందుకు హజార్డ్‌కు 2.5 మిలియన్ల డాలర్ల బోనస్ అందచేసినట్లు తెలిసింది.

ఆర్థిక లావాదేవీలపై స్ట్రింగ్ ఆపరేషన్లు
ఫుట్‌బాల్ లీగ్‌లలో ఆర్థిక లావాదేవీలపై స్ట్రింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు లీక్ వార్తలను వెలుగులోకి తేవడంలో లేసౌర్ ముందుంటుంది. ఇంగ్లండ్ ఫస్ట్ సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్‌లో డిమ్యూనిటివ్ ప్లే మేకర్ హజార్డ్ నెలసరి వేతనం 5.05 మిలియన్ల డాలర్ల నుంచి 5.3 మిలియన్ల డాలర్లకు పెరిగింది. చెల్సియా టీంతో హజార్డ్ కాంట్రాక్ట్ విలువ చాలా తక్కువ అని లీసౌర్ పేర్కొంది. 2012 నుంచి క్రమంగా ఆయన వేతనం పెరుగుతూ వచ్చింది.

బదిలీ కోసం 40 మిలియన్ల డాలర్ల చెల్లింపు
లిల్లే నుంచి చెల్సియా టీంకు హజార్డ్ బదిలీ కోసం 40 మిలియన్ల డాలర్ల బదిలీ ఫీజు చెల్లించినట్లు ఈ దిన పత్రిక కథనం. ఈ విషయాన్ని పక్కనబెడితే చెల్సియా జట్టులో హజార్డ్ మొదటి సీజన్ వేతనం 4.71 మిలియన్ల యూరోలు కాగా, రెండో సీజన్‌కు అది ఐదు మిలియన్లకు పెరిగింది. కానీ ఈ వేతనం వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించదని పేర్కొంది. 2012 నుంచి 2015 వరకు కాంట్రాక్టు పొడిగించడంతో ఆయన వేతనం రెట్టింపయ్యి ఐదు మిలియన్ల యూరోల నుంచి 12.4 మిలియన్ల యూరో (13.31 మిలియన్ల డాలర్లు)లకు పెరిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications