అమ్మ ఒప్పుకుంది! రొనాల్డో పెళ్లి చేసుకోబోయే మోడల్ సెక్సీ ఫిగర్ చూశారా?

హైదరాబాద్: తన గర్ల్‌ప్రెండ్‌ను పెళ్లి చేసుకునేందుకు అమ్మ అంగీకరించినట్లు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తెలిపాడు. 2016 నుంచి రొనాల్డో 25 ఏళ్ల జార్జినా రోడ్రిగెజ్‌తో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అంతకముందు అలనా మార్టినాతో క్రిస్టియానో రొనాల్డోకు ఒక కుమార్తె ఉంది.
ఆ తర్వాత రోడ్రిగెజ్‌తో సహజీవనం ఫలితంగా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. తాజాగా రొనాల్డో ప్రముఖ ఇంగ్లీష్ జర్నలిస్టు పీయర్స్ మోర్గాన్‌కు ఇంటర్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్యూలో రోడ్రిగెజ్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించాడు.

రొనాల్డో మాట్లాడుతూ
రొనాల్డో మాట్లాడుతూ "ఆమె నాకు ఎంతో సాయం చేసింది. ఆమెతో నేను ప్రేమలో ఉన్నా. ఏదో ఒకరోజు ఆమెను వివాహం చేసుకుంటా. మా తల్లి యొక్క డ్రీమ్ కూడా అదే. కాబట్టి ఏదో ఒకరోజు ఆమెను ఎందుకు వివాహం చేసుకోకూడదు?" అంటూ పీయర్స్ మోర్గాన్ ప్రశ్నకు సమాధానమిచ్చాడు.
సంతోషంగా ఉంది
"చాలా సంతోషంగా ఉంది. ఆమె నా స్నేహితురాలు. మా ఇద్దరి మధ్య అనేక సంభాషణలు ఉన్నాయి. నేను ఆమె కోసం హృదయాన్ని తెరిచాను. ఆమె కూడా నా కోసం హృదయాన్ని తెరుస్తుంది" అని రొనాల్డో చెప్పుకొచ్చాడు. రియల్ మాడ్రిడ్ జట్టుకు ఆడుతున్న సమయంలో తొలిసారి రొనాల్డోని రోడ్రిగెజ్ కలిసింది.
నలుగురు పిల్లలతో కలిసి
ప్రస్తుతం రొనాల్డో.. రోడ్రిగెజ్ తమ నలుగురు పిల్లలతో కలిసి టురిన్‌లో నివసిస్తున్నారు. ఆదివారం ద సన్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో రోడ్రిగెజ్ మాట్లాడుతూ తొలిసారి రొనాల్డోను చూడగానే అతడితో ప్రేమలో పడినట్లు తెలిపింది. "మొదటిసారి రొనాల్డోను నేను గూచీ మీటింగ్‌లో కలిశాను, అక్కడ నేను సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నా" అని రోడ్రిగెజ్ పేర్కొంది.
ఓ బ్రాండ్ ఈవెంట్‌లో
"కొన్ని రోజుల తర్వాత మేమిద్దరం మరో బ్రాండ్ ఈవెంట్‌లో ఒకరిని మరొకరం కలుసుకున్నాం. ఆ సమయంలోనే మేమిద్దరం అద్భుతమైన వాతావరణంలో మాట్లాడుకున్నాం. దీంతో ఇద్దరం మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాం. బాగా ఫేమస్ అయిన వ్యక్తికి భాగస్వామిగా ఉండటం అంత ఈజీ కాదు. ఎలాంటి ఒత్తిడిలోనైనా నేను అతని కోసం ఏమనుకుంటునో అది చాలా బలంగా ఉంటుంది" అని రోడ్రిగెజ్ పేర్కొంది.

ఐదు సార్లు ‘బాలోన్ డి ఓర్' అవార్డు
మాంచెస్టర్ జట్టు 2007-09 మధ్య కాలంలో మూడు సార్లు ప్రీమియర్ టైటిళ్లు నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. 2008లో మాంచెస్టర్ జట్టు ఛాంపియన్స్ లీగ్ టైటిల్ నెగ్గడంలో రొనాల్డోదే కీలకపాత్ర. అంతేకాదు ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘బాలోన్ డి ఓర్' అవార్డును రొనాల్డో ఐదు సార్లు(2008, 2013, 2014, 2016, 2017) అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications