ఫోటోలు: రొనాల్డోకే ఫిఫా 2016 అవార్డు
పారిస్: పోర్చుగల్ సూపర్‌స్టార్, లా లీగ జెయింట్స్ రియల్ మాడ్రిడ్ సారథి క్రిస్టియానో రొనాల్డో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. వరుసగా 2016 సంవత్సరానికి గాను నాలుగోసారి 'బాల్లోన్ డి'ఓర్' అవార్డు గెలుచుకున్న రొనాల్డో 'ఫిఫా - 2016' అవార్డునూ కూడా సొంతంచేసుకున్నాడు. జ్యురిచ్‌లో సోమవారం జరిగే కార్యక్రమంలో ఈ స్టార్ ఫుట్‌బాలర్ అవార్డు అందుకోనున్నాడు.
గత ఏడాది చాంపియన్స్ లీగ్, తొలిసారి పోర్చుగల్ జట్టుకు సారథిగా యూరో 2016 కప్ టైటిళ్లతోపాటు క్లబ్ ఫిఫా వరల్డ్ కప్ టైటిల్ కూడా గెలుచుకోవడంతో రొనాల్డో ఖాతాలో చేరడంతో మరో అవార్డునూ అందుకోగలిగాడు. ఈ దఫా రియల్ మాడ్రిడ్ క్లబ్ డబుల్ ధమాకా లభించనున్నది.
జట్టు కోచ్ జినెడినె జిడానెకు ఉత్తమ ఫిఫా అవార్డు - 2016 అవార్డునూ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అమెరికా సినీ కథా నాయిక ఇవా లాంగోరియా ఆధ్వర్యంలో జరిగే అవార్డుల ప్రదానోత్సవాన్ని జర్మనీ టీవీ చానెల్ మార్కో స్కైరెయ్ ప్రసారంచేయనున్నది. కేవలం 12 మ్యాచ్‌ల్లోనే 16 గోల్స్ రికార్డు సాధించిన క్రిస్టియానో రొనాల్డో వరుసగా మూడోసారి చాంపియన్స్ లీగ్‌తోపాటు తొలిసారి యూరో కప్ గెలుచుకున్నందుకే ఆయన్ను ఫిఫా అవార్డు వరించింది.

రొనాల్డోకే ఫిఫా 2016 అవార్డు
రొనాల్డో విజయాలు మరోసారి ఆయన చిరకాల ప్రత్యర్థి బార్సిలోనా ప్లేయర్ లియానెల్ మెస్సీ, అట్లెటికో మాడ్రిడ్ ఫ్రాన్స్ స్ట్రయికర్ అంటోనె గ్రైజ్మన్‌లను తోసి రాజని ఫిఫా అవార్డు గెలుచుకునేందుకు దోహదపడ్డాయి. గత ఏడాది యూరో కప్ ఫైనల్స్‌లో గాయపడిన రొనాల్డో ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. కానీ తానెటువంటి అవకతవకలకు పాల్పడలేదని, 150 మిలియన్ల యూరోలను ఇతర దేశాలు, స్విస్ బ్యాంక్ ఖాతాల్లో జమచేశానన్న వార్తలను తోసిపుచ్చాడు.

ఇబ్బందికరంగా మారిన అవకతవకల విషయం
రొనాల్డో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన వార్తలు ఫుట్ బాల్ జాతీయ జట్లు, సారధులు, జర్నలిస్టులు ‘ఫిఫా' అవార్డు గెలుచుకునే అంశానికి ఇబ్బందికరంగా మారింది. లైసెస్టర్ సిటీతో జరిగిన ఇంగ్లిష్ ప్రిమియర్ లీగ్ ఫైనల్స్ విజేత క్లౌడియో రానైరీ నుంచి ఆశ్చర్యకర రీతిలో పోటీని ఎదుర్కోనున్నాడు. పోర్చుగల్ టీం కోచ్ ఫెర్నాండో సాంతోస్ కు ఉత్తమ కోచ్ అవార్డు లభించనున్నది.

గ్రనడతో విజయం: బార్సిలోనాతో రికార్డు సమం
పోర్చుగల్ సూపర్‌స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో 2017లో తొలి గోల్ చేశాడు. దాంతోపాటు ఈ సీజన్‌లో మరో రికార్డు సాధించాడు. లా లీగ జెయింట్స్ లీగ్‌లో ఎఫ్ సి బార్సిలోనా సాధించిన వరుసగా 39 మ్యాచ్‌ల విజయం రికార్డును సమంచేశాడు. గ్రనడతో జరిగిన మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ జట్టు 5 - 0 స్కోర్‌తో విజయం సాధించింది.

రెండోస్థానంలో నిలిచిన బార్సిలోనా
నాలుగు పాయింట్లు వెనుకబడిన బార్సిలోనా రెండోస్థానంలోనూ నిలిచింది. సెవిల్లా మూడోస్థానంలో నిలిస్తే, ఐబార్ జట్టుపై అట్లెటికో మాడ్రిడ్ 2 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించి నాలుగోస్థానంలో ఉంది. ఇక రియల్ సోస్కీ డాడ్ ఆరో స్థానంలో నిలిచింది. విజయానికి అడ్డంకులు లేవని రియల్ మాడ్రిడ్ కోచ్ జిడానె తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications