Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Fifa World Cup 2022: రొనాల్డో ది గ్రేట్.. మెస్సీ రికార్డు దాటేశాడుగా!

Cristiano Ronaldo surpasses Lionel Messi record during Fifa World Cup 2022 game

ఫుట్‌బాల్ ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో పేరు తెలియని వారుడరు. ఈ క్రీడలో రొనాల్డో అంత పాపులర్ క్రీడాకారులు చాలా తక్కువ. ఆటకే వన్నె తెచ్చిన క్రీడాకారుల్లో అతను ఒకడు. ఈ లెజెండరీ ప్లేయర్ తన కెరీర్‌లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్నాడు. అలాంటప్పుడు రికార్డులు బద్దలవకుండా ఎందుకుంటాయి చెప్పండి? ఘనాతో పోర్చుగల్ మ్యాచ్‌లో అదే జరిగింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌కు తొలి గోల్ అందించిన రొనాల్డో పలు రికార్డులు బద్దలు కొట్టాడు.

ఐదు వరల్డ్ కప్‌లలో..

ఐదు వరల్డ్ కప్‌లలో..

ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ తరఫున తొలి గోల్ చేసిన రొనాల్డో.. గత ఐదు వరల్డ్ కప్‌లలో ప్రతి టోర్నీలోనూ గోల్స్ సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అతను 2006లో ఇరాన్‌పై తన తొలి వరల్డ్ కప్ గోల్ సాధించాడు. అప్పటికి 21 సంవత్సరాల వయసున్న రొనాల్డో.. ఈ మ్యాచ్‌లో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ తర్వాత జరిగిన ప్రతి వరల్డ్ కప్‌లోనూ ఏదో ఒక దశలో గోల్ సాధించి జట్టుకు విజయాలందించాడు.

2018లో ఎదురు లేదు..

2018లో ఎదురు లేదు..

2006 తర్వాత వరుసగా 2010, 2014, 2018, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లలో రొనాల్డో తన జట్టు తరఫున గోల్స్ సాధించాడు. అయితే అతని కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నది మాత్రం 2018 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లోనే అని చెప్పాలి. ఈ టోర్నీలో అత్యద్భుతంగా రాణించిన రొనాల్డో.. వరల్డ్ కప్‌లో ఏకంగా ఆరు గోల్స్ సాధించాడు. కానీ జట్టును మాత్రం ఫైనల్ చేర్చలేకపోయాడు. ఆ వరల్డ్ కప్‌ తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌పై హ్యాట్రిక్ గోల్స్ సాధించిన రొనాల్డ.. అత్యంత పెద్ద వయసులో హ్యాట్రిక్ సాధించిన ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.

మెస్సీని దాటేశాడు!

మెస్సీని దాటేశాడు!

ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఎవరికీ అందనంత దూరంలో ఉండే ధ్రువతారలుగా క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీని చెప్పుకుంటారు. వీళ్లిద్దరి రికార్డులు పోల్చి చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఘనాపై రొనాల్డో చేసిన గోల్‌కు ప్రత్యేకత ఉంది. ఇది ఈ వరల్డ్ కప్‌లో రొనాల్డ చేసిన తొలి గోల్ మాత్రమే కాదు.. మెస్సీ రికార్డును బద్దలు కొట్టిన గోల్ కూడా. ఈ గోల్‌తో ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా మెస్సీని దాటేశాడు రొనాల్డో.

రికార్డు ఏంటంటే?

రికార్డు ఏంటంటే?

ఖతర్‌లో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం అవడానికి ముందు వరకు ప్రపంచ కప్‌లలో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్‌గా మెస్సీ ఉన్నాడు. అతను 19 మ్యాచుల్లో 6 గోల్స్ సాధించాడు. ఈ ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో సౌదీపై కూడా గోల్ చేసిన మెస్సీ.. తన గణాంకాలను 20 మ్యాచుల్లో 7 గోల్స్‌గా మెరుగు పరుచుకున్నాడు. అదే సమయంలో రొనాల్డో ఈ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు వరకు 17 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో 7 గోల్స్‌తో ఉన్నాడు. ఘనాపై గోల్‌తో తను కూడా 18 మ్యాచుల్లో 8 గోల్స్‌గా తన గణాంకాలు మెరుగు పరుచుకున్నాడు. దీంతో ప్రపంచకప్ గేమ్స్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్‌గా మెస్సీ రికార్డును బద్దలు కొట్టాడు.

Story first published: Friday, November 25, 2022, 14:13 [IST]
Other articles published on Nov 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+