For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియల్ మాడ్రిడ్‌కు రాంరాం: రొనాల్డొను కొనేందుకు మాంఛెస్టర్ యునైటెడ్ రెడీ

 Cristiano Ronaldo stands by comments questioning his Real Madrid future

హైదరాబాద్: చాంపియన్స్ లీగ్ టైటిల్ గెలుచుకున్న రియల్ మాడ్రిడ్ జట్లులో తన భవితవ్యంపై క్రిస్టియానో రొనాల్డో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపాడు. మున్ముందు రియల్ మాడ్రిడ్ క్లబ్ జట్టులో ఆడతానా? లేదా? అనే విషయం సందేహాస్పదమేనని అన్నాడు. పోర్చుగల్ ఫార్వర్డ్ ప్లేయర్ ఇప్పటివరకు చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను వరుసగా మూడుసార్లు గెలుచుకోవడంలో క్రిస్టియానో రొనాల్డో కీలక పాత్ర పోషించాడు.

కొద్దిరోజుల్లో భవిష్యత్ ప్రణాళిక బయటపెడతా

కొద్దిరోజుల్లో భవిష్యత్ ప్రణాళిక బయటపెడతా

వచ్చే కొద్ది రోజుల్లో తన భవిష్యత్ ప్రణాళికను బయటపెడతానని తెలిపాడు.క్రిస్టియానో రొనాల్డో మాట్లాడుతూ రియల్ మాడ్రిడ్ గతం అందమైన జీవితం. కానీ జట్టులో తన భవితవ్యంపై వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని తెలిపాడు. అందుకు తాను విచారపడబోనని తెలిపాడు.

 గారెథ్ బాలె, రొనాల్డో విక్రయానికి రియల్ మాడ్రిడ్ రెడీ

గారెథ్ బాలె, రొనాల్డో విక్రయానికి రియల్ మాడ్రిడ్ రెడీ

గారెథ్ బాలె, క్రిస్టియానో రొనాల్డోలను విక్రయించేందుకు సిద్దమని రియల్ మాడ్రిడ్ క్లబ్ అధ్యక్షుడు ఫ్లొరెంటినో పెరెజ్ చెప్పాడు. తద్వారా వచ్చే ఆదాయాన్ని నేయ్మార్‌ను కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తామన్నాడు.

రియల్ మాడ్రిడ్‌ను వీడనున్నామంటూ సంకేతాలిచ్చి

రియల్ మాడ్రిడ్‌ను వీడనున్నామంటూ సంకేతాలిచ్చి

గత శనివారం చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను రియల్ మాడ్రిడ్ జట్టు గెలుచుకున్న తర్వాత క్లబ్‌ను వీడనున్నట్లు క్రిస్టియానో రొనాల్డో, గారెథ్ బాలే సంకేతాలిచ్చారు. ఆటగాళ్ల క్రయ, విక్రయం పరస్పరం ఆమోదయోగ్యమేనని ఫ్లొరెంటినో పెరెజ్ చెప్పాడు. పారిస్ సెయింట్ జెర్మైన్ స్టార్ (పీఎస్జీ) నేయ్మార్ కొనుగోలును ఈ నిధులు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.

రొనాల్డోతో కాంట్రాక్టుకు మాంచెస్టర్ యునైటెడ్ సై

రొనాల్డోతో కాంట్రాక్టుకు మాంచెస్టర్ యునైటెడ్ సై

క్రిస్టియానో రొనాల్డోను కొనుగోలు చేసేందుకు సిద్ధమని మాంఛెస్టర్ యునైటెడ్ టీం మేనేజ్మెంట్ మరోసారి తెలిపింది. క్రిస్టియానో రొనాల్డో కూడా నిరంతరం మాంఛెస్టర్ యునైటెడ్ జట్టులో చేరడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. వాయ్నే రూనీ వైదొలుగుతామని ప్రకటించినప్పటి నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను మాంఛెస్టర్ యునైటెడ్ ప్రయత్నిస్తోంది. అయితే మాంఛెస్టర్ యునైటెడ్ జట్టులో గారెథ్ బాలే చేరే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. జట్టు మేనేజర్ జోస్ మౌరిన్హోతో సంబంధాలు మరోసారి ఇబ్బందికరంగా మారతాయని చెప్పాడు.

 వైదొలుగుతానన్న బార్సిలోనా స్టార్ ఆటగాడు లియానెల్ మెస్సీ

వైదొలుగుతానన్న బార్సిలోనా స్టార్ ఆటగాడు లియానెల్ మెస్సీ

రియల్ మాడ్రిడ్ క్లబ్ జట్టుతోపాటు బార్సిలోనా క్లబ్ జట్టు ఇబ్బందుల్లో పడింది. దేశీయంగా, యూరప్ అంతటా ఐదు టోర్నమెంట్లలో పాల్గొని అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. లా లీగ టోర్నీలో 34 గోల్స్‌తో టాపర్‌గా ఉన్నాడు. బార్సిలోనా క్లబ్ నుంచి వైదొలుగనున్నట్లు హెచ్చరికలకు దిగాడు. ట్రాన్స్ ఫర్ విండోలో మరో క్లబ్ లో చేరతానని లియానెల్ మెస్సీ సంకేతాలివ్వడంతో అన్ని క్లబ్‌ల మేనేజ్మెంట్లు అప్రమత్తమయ్యాయి. శాంటోస్ యంగ్ స్టర్ రోడ్ర్యోగో, గ్రెమియో మిడ్ ఫీల్డర్ ఆర్టూర్ మెలో కూడా జట్టు నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నాడు. అట్లెంటిక్ మాడ్రిడ్ ప్లేయర్ ఆంటోనీ గ్రైజ్మన్.. పీఎస్జీ క్లబ్‌లో చేరనున్నట్లు నేయ్మార్ వైదొలగనున్నట్లు తెలిపాడు.

Story first published: Monday, May 28, 2018, 13:03 [IST]
Other articles published on May 28, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+