Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రొనాల్డో నయా చరిత్ర.. 100 కోట్ల మంది ఫాలోవర్స్

గత రెండు దశాబ్దాలుగా ఫుట్‌బాల్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనత సాధించాడు. సోషల్ మీడియాలో 100 కోట్ల మంది ఫాలోవర్స్‌ను సంపాదించాడు. సామాజిక మాధ్యమాల్లో అన్ని వేదికలను కలుపుకుని ఈ ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో చరిత్ర సృష్టించామని, తన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ రొనాల్డో పోస్ట్ చేశాడు.

''మనం చరిత్ర సృష్టించాం. వన్ బిలియన్ ఫాలోవర్స్! ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు. ఆటపై అభిరుచి, ప్రేమ.. అంతకు మించినది. మదీరా వీధుల్లో నుంచి ప్రపంచ పెద్ద వేదికల వరకు నా కుటుంబం, మీ కోసం ఆడాను. ఇప్పుడు 100 కోట్ల మంది కలిసి ఉన్నాం. నాతో మీరు ప్రతి అడుగులో ఉన్నారు. ఎత్తుపల్లాలో నాతోనే ఉన్నారు. ఇది మన ప్రయాణం. మనం కలిసి సాధించడానికి పరిమితులు లేవని నిరూపించాం''

Cristiano Ronaldo Shatters Records with 1 Billion Followers on Social Media

''నాపై నమ్మకం ఉంచి మద్దతు ఇస్తూ, నా జీవితంలో భాగమైనందుకు ధన్యవాదాలు. అత్యుత్తమైనది ఇంకా రావాల్సి ఉంది. కలిసి ముందుకు సాగుతూ, గెలుస్తూ మనం చరిత్ర సృష్టిద్దాం'' అని రొనాల్డో.. ఏ బిలియన్ డ్రీమ్ ఒన్ జర్నీ అనే ట్యాగ్‌తో సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోర్చుగల్ దిగ్గజ ఆటగాడికి సుమారు 64 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్విటర్‌లో 11.3 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 17 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

యూట్యూబ్‌లో ఆరు కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. రొనాల్డో ఇటీవల యూట్యూబ్‌లో ఖాతాను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే యూట్యూబ్ ప్రారంభించిన అరపూటలోనే రొనాల్డో కోటి మంది ఫాలోవర్లు దక్కించుకున్నాడు. కాగా, రొనాల్డో ఇటీవల ఆటలోనూ అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే.

రొనాల్డో తన కెరీర్‌లో 900వ గోల్ సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రొనాల్డో చరిత్రకెక్కాడు.39 ఏళ్ల అతను 1236 మ్యాచ్‌ల్లో 900 గోల్ మార్క్‌‌ను అందుకున్నాడు. అత్యధిక గోల్స్‌లో రొనాల్డో తర్వాత రెండో స్థానంలో అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ ఉన్నాడు. మెస్సీ 859 గోల్స్ సాధించాడు.

Story first published: Friday, September 13, 2024, 10:52 [IST]
Other articles published on Sep 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+